- డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ 134 వ జయంతి
ఇటు న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, అటు రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన నిరుపమానమైన సేవలు అజరామమైనవి, వెలకట్టలేనివి! మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, కుల, మత రహిత ఆధునిక భారతదేశం కోసం తన జీవితకాలం పాటు ఓక మహా పోరాటం చేసిన ఓ కారణజన్ముడు, మహా యోధుడు డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్. ఆయన జయంతి అయిన ఈ ప్రత్యేక రోజు ఏప్రిల్ 14, 2025 ను పురస్కరించుకొని ఆ మహానుభావుడు తన అమూల్యమైన జీవితకాలంలో సాధించిన ఆఖండ విజయాలను గురించి మరియు ఆ మహోన్నత వ్యక్తి ఆశయాలు, లక్ష్యాలు ఎలాంటివో ఒక్కసారి ప్రతి ఒక్క భారతీయుడు ఈ ప్రత్యేక సందర్బంగా మననం చేసుకోవాల్సిన గురుతర భాద్యత మనందరిపై వుంది. ముఖ్యంగా ఆయన జీవితమే ఓక గొప్ప చారిత్రాత్మిక పోరాటం. అందులో భాగంగా దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం తన జీవిత అధ్యంతం ఓక అలుపెరుగని పోరుసల్పిన ఓక మహా అంకుటిత దీక్ష మెండుగా గల ఓ ఆదర్శ నాయకుడు, యావత మన భారతజాతి మెచ్చిన ఓక గొప్ప సామాజిక సంస్కర్త ఈ బాబా సాహెబ్ అంబేద్కర్ అనడంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. అదేవిధంగా దళితులు ఎదుర్కొంటున్న అంటరానితనం, వివక్షను రూపుమాపాలంటే ఉన్నత విద్యను అభ్యసించడం ఒకటే మార్గమని భావించిన ఆయన తత్వరమే విదేశాలకు పయనమై మరీ కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఎకనామిక్స్ తో పాటు ఎన్నో ప్రఖ్యాతి గాంచిన విధ్యాసంస్థల్లో విద్యను అభ్యసించి ఎంఏ, పీహెచ్ డీ, న్యాయ శాస్రంలో పీహెచ్ డీ పూర్తి చేయడమే కాదు, విదేశాలలో ఎకనామిక్స్ లో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్ర పూటల్లోకి ఎక్కిన గొప్ప చరిత్ర మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారిది. ముఖ్యంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1891 లో ఏప్రిల్ 14 న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అంబవాడే లో రామ్ జీ, భీమా బాయి దంపతులకు జన్మించారు. ఇక ఆయన తండ్రి గారు రామ్ జీ బ్రిటిష్ భారతీయ సైన్యంలో సుబేదార్ గా పనిచేసే కాలంలో అంబేద్కర్ చిన్నప్పటి నుంచే అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే సమయంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. అగ్ర కులాల వారి అధిపత్య పోరును ఎదుర్కొంటూ మరీ అత్యంత దిగ్విజయంగా అత్యధిక మార్కులతో మెట్రిక్యులేషన్ పాసయినా తర్వాత ఆయన ఇక వెనుదిరిగి చూడలేదు. అయితే అన్నింటికి మించి ఆయన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని విదేశాల నుంచి వచ్చిన తరువాత సైతం తన వర్గంలోని అణగారిన వర్గాల ప్రజలకు చదువు చెప్పించారు,వారిని ప్రొత్సహించారు, ‘ బహిష్కృత హితకారిణి ‘ అనే సంస్థను స్థాపించి అంటరానితనంపై తన అనుభవాన్ని అంతారంగరించి మరీ పోరాటం చేసిన గొప్ప సాహసి, కార్యదీక్ష పరుడు ఈ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. ఏదిఏమైన 1931లో రౌండ్ టేబుల్ సన్నాహల సందర్బంగా అంబేద్కర్ గారు మన జాతిపిత మహాత్మాగాంధీజీని సైతం కలవడమే కాదు, ఆ తరువాత స్వాతంత్య్ర భారతవానికి తొలి న్యాయ శాఖ మంత్రిగా పనిచేసి, ప్రభుత్వం తనకు అప్పగించిన రాజ్యాంగ రచన బాద్యతలను సైతం సమర్థవంతంగా నిర్వహించి అత్యంత దృడమైన రాజ్యాన్ని మన భారతదేశానికి అందించారు. అంతేకాదు తన హయాంలో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి మరీ వారి జీవితాల్లో వెలుగులు నింపి తన జీవితానికి గొప్ప సార్థకతను సైతం చేకూర్చుకున్న ఓక దృఢదీక్ష తత్పరుడు ఈ బీఆర్ అంబేద్కర్ గారు. ఏమైనా అటు మన భారతదేశానికి ఆర్థిక వేత్తగా సైతం పారిశ్రామికీకరణ, వ్యవసాయాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మడమే కాదు తదనుగుణంగా ఓక ఆదర్శ పాలనకు సాగించి అందరిచే శెభాష్ అనిపించుకున్నారు ఓక మంచి పరిపాలనదక్షకులు ఈ బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ ప్రత్యేక రోజును పురస్కరించుకొని ఆ మహాపురుషుడు బాబా సాహెన్ అంబేద్కర్ కి మనమంతా అత్యంత గొప్పగా నివాళులు అర్పిద్దాం.
అమర్ రహే, అమర్ రహే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు!
ఆయన ఆశయాలు, లక్ష్యాలు మరో పది కాలాలపాటు అత్యంత దిగ్విజయంగా వర్ధిల్లాలి! జై హింద్! మేరా భారత్
- కామిడి సతీష్ రెడ్డి