తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు వణికించాయి. మహబూబ్నగర్ జిల్లాలోని కౌకుంట్ల మండలం దాసరపల్లెలో మధ్యాహ్నం 12.15 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం ఉమ్మడి వరంగల్, ఖమ్మంతో పాటు ఏపీలోని కొన్నిచోట్ల కనిపించింది.