Saturday, April 19, 2025
spot_img

భయంతోనే ఈడి వేధింపులు

Must Read

కాంగ్రెస్‌ బలం పెరుగుతుందనే సోనియా గాంధీ,రాహుల్‌ గాంధీలపై ఈడి కేసులు – మంత్రి పొన్నం ప్రభాకర్‌

బీజేపీ అంటేనే ఈడి, మోడీ, ఐటీ దాడులుగా పని చేస్తుందని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. గత ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ బలం పెరుగుతుండడం, ప్రజల కోసం అనేక ఉద్యమాలు కార్యక్రమాలు చేస్తుండడంతో బీజేపీ మీద వ్యతిరేకత జరుగుతున్న సందర్భంలో మా అధినాయకత్వం అయిన సోనియా గాంధీ రాహుల్‌ గాంధీల‌ను నేషనల్‌ హెరాల్డ్‌ లో ఈడి పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని అయన విమర్శించారు. సోనియా, రాహుల్‌ గాంధీల పై ఈడీ అధికారుల కేసులను ఉద్దేశించి అయన మాట్లాడుతూ నేషనల్‌ హెరాల్డ్‌ పై ఏమైనా ఉంటే చర్యలు తీసుకోవచ్చు కానీ వేధింపుల కొరకు మాత్రమే ఉపయోగించుకొని హార్స్మెంట్‌ కోసమే ప్రభుత్వ విధానం నడుస్తుందని దుయ్యబట్టారు. నరేంద్ర మోదీకి ఇది మంచిది కాదని, పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీకి జవాబు చెప్పలేకపోయారని విమర్శించారు.

దేశ వ్యాప్తంగా బీజేపీ వైఫల్యాల పట్ల కాంగ్రెస్‌ పోరాటాలు చేస్తుందన్నారు. బీజేపీ కాంగ్రెస్‌ను ఎంతగా అణిచివేయాలని చూస్తే మా పార్టీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో బీజేపీ వైఫల్యాల ప్రజా వ్యతిరేకత పై మా పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ వెంట దేశం మొత్తం ఉందని, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాన్ని వేధిస్తే మంచిది కాదని సూచించారు. అంబేద్కర్‌కి దండ వేసి నివాళులు అర్పించని పార్టీ ప్రముఖులు అంబేద్కర్‌ దగ్గరకు వస్తె రాజకీయం చేస్తే అంబేద్కర్‌ మీద ప్రేమ ఎంత ఉందో తెలుసని అన్నారు. అంబేద్కరిజంకి వారసులు కాంగ్రెస్‌ పార్టీ అని అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం రక్షించేది కాంగ్రెస్‌ పార్టీ అని స్పష్టం చేశారు. మేము రాజ్యాంగ రక్షణ కోసం మాట్లాడుతుంటే బీజేపీ ఓర్వలేక మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Latest News

కేటీఆర్‌కు ఎంపీ చామల చురకలు

కేటీఆర్‌ ప్రధాని ట్విట్‌కు చామల కౌంటర్‌ హెచ్‌సీయూ భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు ఎక్స్‌ వేధికగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS