Thursday, March 20, 2025
spot_img

అందనంత అవినీతి

Must Read
  • అయినా సార్ పై చర్యల్లేవ్.?
  • జీహెచ్ఎంసీ కమిషనర్ సైలెంట్ వెనకా.?
  • ప్రభుత్వం పరువు తీస్తున్న సనావుద్దీన్
  • జీహెచ్ఎంసీలోనే బిగ్ఎస్ట్ కరప్షన్ పర్సన్
  • ఎన్నో తప్పులు.. మరెన్నో ఆరోపణలు
  • డిప్యూటేషన్ పై వచ్చి పెత్తనం చెలాయింపు
  • మాతృశాఖకు పంపినా.. కుర్చీ వ‌ద‌ల‌ని స‌నావుద్దీన్‌
  • ఓ పొలిటికల్ లీడర్ అండతో దర్జాగా కొలువు కంటిన్యూ
  • లెస్ 25%కి పని చేస్తామంటే లెస్ 1శాతం వారికి కాంట్రాక్ట్
  • జీహెచ్ఎంసీకి లెస్ 24శాతం లాస్ చేసిన ఈఈ సనావుద్దీన్
  • కాంట్రాక్టర్ల వద్ద అధిక మొత్తంలో వసూల్
  • నా అనుకున్న వారికే పనులు అప్పగింత
  • అర్హులను కాదనీ వాటా ఇచ్చిన వ్యక్తికే కాంట్రాక్ట్

ప్రభుత్వంలో పనిచేసే ఆఫీసర్లను చూస్తే సామాన్యులకు సిగ్గనిపిస్తోంది. నెలనెలా రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ లంచాలకు కక్కుర్తి పడుతున్నారు. ఏ డిపార్ట్ మెంట్ చూసినా, ఏ ఏరియాకు వెళ్లినా అవినీతి అధికారుల గురించే చెబుతారు. చప్రాసీ మొదలు ఐఏఎస్ ల వరకు అంతా అదే తొవ్వ. ఏ ఫైల్ ముందుకు వెళ్లాలన్నా, ఏ పని పూర్తి కావాలన్నా డబ్బులతోటే అవుద్ది. అసొంటి గొప్ప రాష్ట్రం మన తెలంగాణ. ఇంకా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ లో అయితే కాసింత ఎక్కువే. జీహెచ్ఎంసీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ‘అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు’ పదిలో ఒక్కరిద్దరూ మంచి వాళ్లున్నా ఆ మాట అందరికీ వస్తుంది. పట్నంలో పనిచేసే ఓ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ సాబ్ అవినీతి అనకొండ అని చెప్పవచ్చు. అయ్యో పలానా దాంట్లో రూపాయి పడ్డదన్న.. తీసుకొని కడ్కొని జేబులో వేసుకునే వాడు. తనకు నౌకర్ వచ్చింది ఓ శాఖలో అయితే.. ప్రస్తుతం కొలువు యలగబెట్టేది మరోదాంట్లో. డిప్యూటేషన్ పై జీహెచ్ఎంసీలోకి వచ్చి అక్కడంతా దున్నేశాడు. కాంట్రాక్ట్ లు, బిల్లుల చెల్లింపులు, ఇతరత్రా ఏవైనా ఏదో ఒక రకంగా పైసలు దండుకోవాలనే చూస్తాడు. ప్రభుత్వం చేయించే ఏవైనా పనులు అప్పగించాలంటే తన చేయి తడిపితే లేదా ఇంత వాటా ఇస్తానని చెబితే చాలు ఆరు నూరైనా కాంట్రాక్ట్ పలానా వారికే వచ్చేలా చేస్తాడు. పేరుకే టెండర్లు వేస్తారు.. కానీ లోలోపల జరగాల్సిందంతా సైలెంట్ గా చేసేస్తాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే… జీహెచ్ఎంసీ పరిధిలోని చంద్రాయణగుట్ట డివిజన్ 8లో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ గా షేక్‌ స‌నావుద్దీన్‌ ఉద్యోగం చేస్తున్నారు. ఆయన మాతృశాఖ రాష్ట్ర విద్య సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ. 15ఏళ్లుగా డిప్యూటేష‌న్‌పై వచ్చి తిష్ట‌వేసి కూర్చున్నాడు. కొన్నేళ్లుగా జీహెచ్ఎంసీలో సీసీ రోడ్డు, ఎస్‌డ‌బ్ల్యూ డ్రైన్‌, బాక్స్ డ్రైన్‌, గ్రేవియాడ్ ప‌నుల్లో భారీగా అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి. క‌మ్యూనిటీ హాల్‌, అత్య‌వ‌స‌ర విప‌త్తు ప‌నుల్లో కూడా రూ. వంద‌ల కోట్లు ప‌నులు చేయించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లలితాబాగ్ డివిజన్ లో వర్షపు నీరు మరియు ఇతర నీటిని తొలగించడానికి నిర్మించబడే కాలువలు, రెయిన్ డ్రైన్ల 2025 క్యాలెండర్ వార్షిక నిర్వహణకు ఎస్టీ (గిరిజనులు) కులానికి చెందిన కాంట్రాక్టర్ల కోసం టెండర్లు (ఐడి నెం. 576785/2025) పిలిచింది. వారికే రిజర్వ్ చేయడంతో వి.గౌతమ్ నాయక్, ఇస్లావత్ శ్రీను, కె.చరణ్ సింగ్, లూనావత్ శ్రీదేవి, ఎల్.సురేందర్, ఏ గ్రేడ్ అసోసియేట్స్ అప్లై చేసుకున్నారు. అందులో 25శాతం లెస్ లో టెండ‌ర్ కొటేష‌న్ వేసిన ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 ఏజెన్సీల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు ప‌నులు కేటాయించ‌లేదు. ఇత‌ర కార‌ణాల చేత ఉద్దేశ‌ పూర్వ‌కంగా టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేశారు. అనంతరం తన‌కు అనుకూలంగా ఉన్న కాంట్రాక్ట‌ర్ల‌తోని లోపాయికారి ఒప్పందాలు చేసుకొన్నారు. కానీ, కేవలం లెస్ 1 % పనులు చేస్తామన్న వి.గౌతం నాయక్ కి కాంట్రాక్ట్ ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ రూ.25,18,449లుగా డిసైడ్ చేశారు. అయితే దానిలో లెస్ ఒక శాతంతో కేవలం రూ.24,93,264.51లకు కాంట్రాక్ట్ ఇచ్చారు. లెస్ 24శాతం తగ్గడంతో జీహెచ్ఎంసీకి రూ.10,073,796లు లాస్ వచ్చింది. ‘అన్నం పెట్టే వాడికన్నా సున్నం పెట్టే వాళ్లే ఎక్కువ’ అన్న చందంగా కొందరూ ఇలాంటి వారివల్ల ప్రభుత్వం చాలా చెడ్డ పేరు వస్తుంది.

ఈఈ స‌నావుద్దీన్‌ కాంట్రాక్టర్ల వద్ద పెద్ద మొత్తంలో పర్సంటేజీలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా జీహెచ్ఎంసీ ఖ‌జానాకు కోట్ల మేర న‌ష్టం వాటిళ్లుతుంది. ఖాన్ సాబ్ దాదాపు రూ.200కోట్ల అవినీతి సొమ్ము సంపాదించినట్లు తెలుస్తోంది. నాసిరకం పనులు, సగం పనులు చేసినా డబ్బులు చెల్లింపులు చేశారు. జీహెచ్ఎంసీలోనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సనావుద్దీన్ బిగెస్ట్ కరప్షన్ పర్సన్ చెప్పుకుంటున్నారు. డిప్యూటేషన్ పై వచ్చి పెత్తనం చెలాయిస్తున్నాడు. ఈ సారూ చేసిన తప్పులు ఎన్నో.. మరెన్నో ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆదాబ్ హైదరాబాద్ లో ఈ నెల 3వ తేదీన ‘అవినీతి బాద్ షా సలావుద్దీన్’ అనే శీర్షికతో కథనం ప్రచురించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మాతృశాఖకు పంపుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయనపై చర్యలకు ఉపక్రమించాలని లేఖరాసిన ఓ పొలిటికల్ లీడర్ ఒత్తిడితో ఉన్నతాధికారులు కమిషనర్ ఆదేశాలు పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. కొంతమంది అండతో దర్జాగా అక్కడే కొలువు కంటిన్యూ చేస్తున్నాడు. ఈఈ సనావుద్దీన్ పై చర్యలు తీసుకోవాలని, పూర్తిగా ఉద్యోగంలో రిమూవల్ చేయాలని కోరుతున్నారు. ఆయన అవినీతి ఆస్తులపై విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

అమరావతికి అంతర్జాతీయ సంస్థల రుణాలు

రైల్వే ప్రాజెక్ట్‌ ఖర్చు కేంద్రమే భరిస్తుంది శాసనమండలిలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS