దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరకొరియాపై సానుభూతి చూపిస్తూ ప్రతిపక్షాలు దక్షిణ కొరియా రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని..ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఎమర్జెన్సీ విధించక తప్పని పరిస్థితి ఏర్పడిందని యూన్ యోల్ తెలిపారు.