జమ్మూకశ్మీర్ లో బుధవారం ఉగ్రవాదులు,భద్రతా బలగాల మధ్య మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది.మంగళవారం ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఉదంపూర్ లో భద్రతా బలగాలు కుంబింగ్ నిర్వహించాయి.ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాల పై కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అడవిలోకి పారిపోయారు.దింతో గాలింపు చర్యలను ముమ్మరం చేసిన భద్రతా బలగాలపై శివ్ గఢ్-అస్సార్ ప్రాంతంలో మరోసారి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో 48వ రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఓ ఆర్మీ క్యాప్టెన్ అమరుడయ్యాడు.బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారని అధికారులు వెల్లడించారు.
మరోవైపు గురువారం స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సైన్యం అప్రమత్తమైంది.ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారంతో పెద్దఎత్తున బలగాలను మోహరించారు.