Saturday, November 23, 2024
spot_img

అంతా నా ఇష్టం..

Must Read

( అధికారం అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన యవ్వారం )

  • ఉపాధ్యాయులకు నచ్చిన చోట పోస్టింగ్
  • నిబంధనల ప్రకారం ఏపీఓగా ఎస్జీటీని నియమించాలి
  • కానీ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ అసిస్టెంట్ నియామకం
  • చాలా ఏళ్లుగా అక్కడే కొనసాగుతున్న ఎస్ఏకు పోస్టింగ్
  • బదిలీ చేయాల్సి ఉంటుందని ఏపీఓగా సీహెచ్ శ్రీనివాస్ కు పోస్టింగ్
  • ఏపీఓగా సీహెచ్ శ్రీనివాస్ నియమించడంపై అనుమానాలు
  • జిల్లా అధికారి అశోక్ పైన అనేక అవినీతి ఆరోపణలు
  • సూర్యాపేట జిల్లా డీఈవోపై ఉపాధ్యాయుల అసహనం

తెలంగాణలో అవినీతి లేని శాఖ ఏదైనా ఉందా అని వెతికితే ఒక్కటీ దొరకదు కాబోలు. ‘అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం’ అన్నట్టు విద్యాశాఖ డిపార్ట్ మెంట్ సహ మిగతా డిపార్ట్ మెంట్ వారందరూ కూడా తమ శాఖలో అలాంటివేమి ఉండవని బొంకుతారు. కానీ అవన్నీ ఒట్టిమాటలేనని లోకానికి తెల్వదు అనుకుంటరు కావొచ్చు. స్కూల్ ఎడ్యూకేషన్ లో అవినీతి యధేచ్చగా నడుస్తోంది అనడానికి ఇదే సంఘటనే నిదర్శనం. పిల్లలకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు నచ్చిన చోట పోస్టింగ్ వేయించుకోవడానికి ఎంతంటే అంత లంచం ఇచ్చుకోవడానికి వెనుకాడడం లేదు. జిల్లా స్థాయి అధికారి సాక్షాత్తు ముడుపులు తీసుకొని బదిలీలు లేకుండా చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా డీఈవో అశోక్ పై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే… సూర్యాపేట జిల్లా డీఈవో అశోక్ తనా అనుకున్న వారికి ఇష్టంవచ్చినట్లు పోస్టింగ్ లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఏపీఓ పోస్టింగ్ కు నిబంధనల ప్రకారం ఎస్జీటీని నియమించాల్సి ఉంటుంది. కానీ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని ఎస్ఏను (స్కూల్ అసిస్టెంట్ ) నియమించడం చర్చనీయాంశం అవుతుంది. అప్పటికే గత కొన్నేళ్లుగా చివ్వెంలలోని జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) గా పనిచేస్తున్న సీహెచ్ శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడ్నుంచి బదిలీ కావాలి. కానీ డీఈవో కు లంచం ఇచ్చి మరీ ఏపీఓ (అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీస‌ర్‌) సీటులో కూర్చోవడం జరిగింది. అయితే దీని వెనుక ఎంత డబ్బులు చేతులు మారాయి అనేది తెలియాల్సి ఉంది. కానీ ఉపాధ్యాయులు, ఉద్యోగుల విషయంలో డీఈవో అశోక్ మాముళ్లు తీసుకోనిదే ఏ పని చేయడని తెలుస్తోంది.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న ఏపీఓ పోస్ట్ కు అర్హులైన ఎస్జీటీలు చాలా మందే ఉన్నప్పటికీ వారెవరికీ కాదని తనకు నచ్చిన వ్యక్తికి పోస్టింగ్ ఇయ్యడం వెనుక ఆంతర్యామేంటో తెలియడం లేదు. గతకొంత కాలంగా ఎస్ఏ గా విధులు నిర్వర్తిస్తున్న సిహెచ్ శ్రీనివాస్ ను ఏపీఓగా నియమించడానికి డీఈఓ అశోక్ భారీగా లంచం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదే విషయంమై రీజినల్ జాయింట్ డైరెక్టర్ కు ఫిర్యాదు అందగా వెంటనే దర్యాప్తు చేసి పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించడం జరిగింది. కానీ డిఈఓ ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరించడం శోఛనీయం.

ఇదే విషయంపై ఆదాబ్ ప్రతినిధి వివ‌రణ కోరగా జిల్లా విద్యాశాఖ అధికారికి సొంత నిర్ణ‌యం తీసుకునే అధికారం ఉంటుందని, ఎలాంటి నిబంధనలు అవసరం లేదని.. నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం జరిగింది. జిల్లా స్థాయి అధికారి ఉపాధ్యాయుల పట్ల ఇంత వివక్షగా ఉండడం వెనుక అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతకు ముందు కూడా ఈయనపైన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విద్యాశాఖాధికారిపైన ఉన్నతాధికారులు దృష్టిసారించి ఆయన అవినీతి, ఆరోపణలపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా అర్హులైన వారిని ఏపీఓగా (అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీస‌ర్) నియ‌మించాల‌ని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS