శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఖరీదైన గం*జాయిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద నుంచి రూ.13.3 కోట్లు విలువైన హైడ్రోఫోనిక్ గం*జాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. గత నెల 30న కూడా బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద రూ.40 కోట్లు విలువ చేసే హైడ్రోఫోనిక్ గం*జాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.