Wednesday, April 2, 2025
spot_img

మసకబారిపోతున్న… పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువు

Must Read
  • ఓయూ పరిధిలో 44 ఎంబీఏ కళాశాలల ఇష్టారాజ్యం
  • పేద విద్యార్థుల భవిష్యత్తుతో కాలేజీల ఆటలు
  • 2024 ఫిబ్రవరి నోటిఫికేషన్ సమయంలో లోపాయికారి ఒప్పందం ?
  • ఆడిట్ సెల్ డైరెక్టర్ ను కలిసిన యాజమాన్యాలు
  • అప్పటి వీసీ ఛాంబర్ లో చక్రం తిప్పే ఓ పర్సన్.?
  • అతన్ని కలిస్తే నోటిఫికేషన్ అయిపోయినట్టేనా….
  • భారీగా డబ్బులు చేతులు మారినట్లు అనుమానాలు
  • మూడు నెలల క్రితం నోటీసులు.. మరీ చర్యలకు ముహూర్తం ఎప్పుడో.?
  • ఉన్నత విద్యామండలి చైర్మన్ కు తెలుసా.?
  • దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ వీసీ నిర్ణయమేంటి.!
  • ఈడీ, సీబీఐకీ ఫిర్యాదు చేస్తాం : సీజేఎస్ అధ్యక్షులు

చదువు చారెడు బలుపాలు దోసెడు అన్నట్టుగా రాష్ట్రంలో ఉన్నత విద్యసాగుతోంది. గల్లీకొకటిగా పెరిగిపోయిన డిగ్రీ, పీజీ కాలేజీలు పేద విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. రాజకీయ, డబ్బు పలుకుబడితో పెద్ద ఎత్తున విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తూ కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. అధికారులకు మాముళ్లు ముట్టజెప్పుతూ కనీసం అర్హత లేని ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకొని కొద్దొగొప్పో లాంటి క్యాంపస్ లు చూపించి బడా కాలేజీలుగా విర్రవీగుతున్నాయి. వేలు, లక్షల్లో ఫీజులు తీసుకుంటూ విద్యార్థులకు పూర్తి న్యాయం చేయడం లేదు. యూనివర్సిటీ నియమ నిబంధనలు సైతం పాటించడం లేదు. పొలిటికల్ లీడర్లు అండతో నడిచే కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో ప్రతి ఏటా లక్షల్లో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసి బయటకు వస్తున్న విద్యార్థులు చివరకు ఎలాంటి ఉద్యోగ, ఉపాధి పొందుకోలేకపోతున్నారు. లక్షలాది రూపాయలు పెట్టి మూడు నుంచి ఆరు సంవత్సరాలు చదివితే చిన్నా, చితక ఉద్యోగాలు దిక్కు అవుతున్నాయి. కాలేజీలపైనా ఉన్నత విద్యామండలి నిఘా కొరవడిందని కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. సదరు కళాశాలల యాజమాన్యాలకు అమ్ముడుపోయి వారికి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి డిగ్రీ, ఎంబీఏ లాంటి ఉన్నత చదువు పూర్తిచేసి తమ కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలపాలనుకునే విద్యార్థి కల కలగానే మిగిలిపోతుంది.

‘చదువుకున్నోడికన్నా పలానోడు మేలు’ అని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు అట్లనే ఉంది ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీ, ఎంబీఎ చదువులు చదివిన విద్యార్థుల పరిస్థితి. కనీసం అనుభవం, అర్హత లేని కాలేజీల్లో చేరి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి సర్టిఫికేట్ లు పట్టుకొని బయటకు వచ్చేసరికే ఈ విషయం అర్థమవుతుంది. రాష్ట్రంలో ఇలాంటి ఫేక్ కాలేజీల లెక్కబాగానే ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 44 ఎంబీఏ కళాశాలలు తరగతులు నిర్వహించడం లేదు. కనీసం అధ్యాపకులు లేకుండా, ఫేక్ అటెండెన్స్ వేస్తున్న పరిస్థితులు కోకొల్లలు. అంతేకాకుండా ఫేక్ ప్రాజెక్ట్ ల తోటి కళాశాలలు నిర్వహిస్తూ అన్ స్కిల్డ్ విద్యార్థులను తయారు చేస్తున్నాయి. ఎలాంటి ఉద్యోగాలకు పనికి రాకుండా చేస్తున్నా ప్రైవేట్ యాజమాన్యాలపైన మూడు నెలల క్రితం ఫిర్యాదు చేయడం జరిగింది. కంప్లైంట్ చేస్తే ఉస్మానియా యూనివర్సిటీ నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి. అంతేకానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డూప్ కాలేజీలపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ మౌన వ్రతంలో ఉన్నదో అంతుచిక్కడం లేదు. ఆడిట్ సెల్ అధికారులు కళాశాలపైన చర్యలు తీసుకోకుండా ఒత్తిడి చేస్తున్నది ఎవరు అనే విషయం తెలియాల్సి ఉంది. ఫేక్ కళాశాలలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోకపోతే యూనివర్సిటీ ప్రతిష్ట రోజురోజుకు దిగజారిపోతుంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొన్ని మార్పులు చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఎడ్యూకేషన్ సిస్టమ్ లో కూడా ఛేంజెస్ చేసింది. యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ వచ్చింది. కానీ, ‘తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడు’ అన్న చందంగా విద్య వ్యవస్థలో ఎటువంటి మార్పులు రాలేదు. ఉస్మానియా యూనివర్సిటీకి కొత్తగా వచ్చినటువంటి వైస్ ఛాన్స్ లర్ కుమార్ బాధ్యతలు చేపట్టాక ప్రైవేట్ కళాశాలల ప్రక్షాళన జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగా క్రియా రూపం దాల్చాలని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. 2024 ఫిబ్రవరిలో ఎంబీఏ కళాశాలల నోటిఫికేషన్ సమయంలో, స్క్రూట్ నీ, సెలక్షన్ కమిటీల పేరుమీద ప్రతి కళాశాల నుండి ఒక్కొక్కరుగా బలవంతంగా బాధపడుకుంటా వచ్చి, వీసీ చాంబర్లో చాలా ఏళ్లుగా పాతుకుపోయిన ఆఫీసర్ని కలిసి ముడుపులు అప్పజెప్పితే తప్ప నోటిఫికేషన్ జరగలేదని ప్రైవేట్ యాజమాన్యాలు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ‘డబ్బుకు లోకం దాసోహం’ అన్నట్టుగా కొంత‌మంది ఉన్నత విద్యాశాఖ అధికారులు లంచాలు తీసుకుంటూ అట్టి కాలేజీల యాజమాన్యాలకు ఒత్తాసు పలుకుతున్నాయి. వాస్తవానికి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 500పైగా డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రతి కళాశాల సుమారు రూ.5 వేల నుంచి 10వేల రూపాయలు ఇతగాడికి ఇస్తున్న‌ట్లు స‌మాచారం. అంటే, ఎంతలా వారికి వారధిగా ఉన్నాడో అర్థమవుతుంది. ఇతను ప్రతి సర్క్యులర్ ను , ఆర్డర్లను మరియు ఫిర్యాదు చేసిన కాపీలను సెకండ్లలో ప్రైవేట్ యాజమాన్యులకు చేరవేయడం ఇతని స్పెషాలిటీ. డిగ్రీ మరియు పీజీ కళాశాలల తనిఖీలకు వెళ్లేటప్పుడు ఆడిట్ సెల్ అధికారులు ఇతగాడినే తీసుకెళ్తారంటే ఎంతటి నమ్మకం కలిగిన వ్యక్తో ఇట్టే మనకు తెలుస్తోంది.

సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేస్తాం
పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే ఉన్నత విద్యామండలి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. ఫేక్ కాలేజీల యాజమాన్యాలతో అవినీతి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. నోటిఫికేషన్ సమయంలో జరిగినటువంటి యూనివర్సిటీ ఆడిట్ సెల్ అధికారులు, ప్రైవేట్ ఎంబీఏ కళాశాలల భాగోతాన్ని అంతా ఆధారాలతో సహా సీబీఐ, ఈడీ కి ఫిర్యాదు చేస్తే మొత్తం బండారం అంత బయట పడుతుందని అప్పుడు యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను, విద్యార్థుల భవిష్యత్తును కాపాడవచ్చు అని మాసారం ప్రేమ్ కుమార్ తెలియజేశారు.

నోటీసులు జారీ చేసిన కాలేజీల వివ‌రాలు

  1. A Kingston PG College, Charlapally. RR. District
  2. Omega PG College MBA. Ghatkesar. RR District-
  3. Manpower Development College, Moula-ah, Hyd
  4. KPRIT College of Engineering (Autonomous), Ghatkesar. RR Dist.
Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS