మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుపై గతకొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా బిజెపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. బుధవారం జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరుకు ఆమోదం లభించింది. రేపు మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముంబైలోని ఆజాద్ మైదానంలో ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో సహ ఎన్డీయే కీలక నేతలు హాజరుకానున్నారు.