Thursday, March 13, 2025
spot_img

సన్నాల సాగుపై రైతుల ఆసక్తి

Must Read

ధాన్యం ధరల పెరుగుదలతో మారుతున్న రైతు

జిల్లాలో యాసంగి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. యాసంగిలో సన్న వరి వేయడంతో రైతులు సాగులో నిమగ్నమయ్యారు. దొడ్డురకాలకు డిమాండ్‌ లేకపోవడంతో సన్న రకాలపై రైతులు మొగ్గు చూపుతున్నారు. సన్నరకానికి ప్రభుత్వం 500 బోనస్‌ ప్రకటించడంతో ఇప్పుడు రైతులు వాటిని పండిస్తున్నారు. ప్రజలు కూడా ఇప్పుడు సన్నరకాలకు అలవాటు పడ్డారు. జిల్లాలో వరి ఎక్కువ సాగు చేయడం వల్ల రైతులు ధాన్యం అమ్ముకునేందుకు తిప్పలు పడే పరిస్థితులు ఏర్పడ నున్నాయి. జిల్లాలో వర్ని, మోస్రా, చందూర్‌, కోటగిరి, రుద్రూర్‌ మండలాల పరిధిలో వరి సాగును ముందుగా చేశారు. ఈ నెలాఖరు నుంచి వరి కోతలను మొదలు పెట్టనున్నారు. ఈ మండలాల పరిధిలోని రైతులు ఇప్పటికే సూర్యాపేట, కర్నూల్‌, బల్లారి వ్యాపారులతో ఒప్పందాలను చేసుకుం టున్నారు. వరికోతలు మొదలుపెట్టగానే వారికే ధాన్యాన్ని అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా సన్నబియ్యం ధరలు అనూహ్యంగా పెరగడం, మార్కెట్లో డిమాండ్‌ పెరగడంతో రైతులు ఈ రకాలకు మొగ్గు చూపారు. దీంతో అమ్మకాల్లో పెద్దగా ఇబ్బందులు ఉంవని భావిస్తున్నారు. గతేడాది నుంచి ఇదే పద్దతి అవలంబిస్తున్నారు.

రైతులు ఆరుతడి పంటలను సైతం ఎక్కువ మొత్తంలో సాగు చేశారు. జిల్లాలో పంటల సాగు వాస్తవ పరిస్థితిని తెలుసు కునేందుకు వ్యవసాయ అధికారులు క్లస్టర్‌ల వారీగా క్రాప్‌ బుకింగ్‌ను చేస్తున్నారు. ప్రతి గ్రామ పరిధిలోకి వ్యవసాయశాఖ అధికారులు వెళ్లి క్రాప్‌ బుకింగ్‌ యాప్‌ ద్వారా సర్వే నెంబర్‌లను నమోదు చేస్తున్నారు. సర్వే మ్యాప్‌లో రైతులు వేసిన పంటల వాస్తవ పరిస్థితిని గుర్తించి విస్తీర్ణాన్ని నమోదు చేస్తున్నారు. ఏయే పంటలు వేశారో వివరాలను నమోదు చేస్తున్నారు. వరితో పాటు ఏ పంటలు ఎక్కువగా వేశారో వాటిని నమోదు చేస్తున్నారు. పంటల మార్పిడికి రైతులు మొగ్గుచూపారా లేదా అనే అంశాలను ఈ క్రాప్‌ బుకింగ్‌ ద్వారా వివరాలను తెలుసుకుంటున్నారు. మొత్తం జిల్లాలో సాగైన పంటల విస్తీర్ణం, వాటి వివరాలను వెంటనే ట్యాబ్‌లో నమోదు చేసి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో సన్న రకాలు సాగుచేసిన రైతులతో రైస్‌ మిల్లర్‌లు కూడా ఒప్పందాలు చేసుకుంటున్నారు. తమ మిల్లులకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో రైతులు వేసిన పంటలను కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. జిల్లాలో పంటల సాగు మొదట తగ్గినా.. రైతులు ఆరుతడి పంటలను వేయడంతో సాగు పెరిగిందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

క్రాప్‌ బుకింగ్‌ ద్వారా పంటల వాస్తవ పరిస్థితిని నమోదు చేశామని తెలిపారు. వరి కొంతమేర తగ్గిన ఎర్రజొన్న, సజ్జ, నువ్వులు, పొద్దుతిరుగుడు పంటలు పెరిగాయన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే కొంతమేర పంటలు తగ్గినా ఎక్కువ మొత్తంలోనే సాగు కొనసాగించారు. జిల్లా వ్యాప్తంగా గడిచిన నెల రోజులుగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న క్రాప్‌ బుకింగ్‌ వల్ల పంటల సాగు వాస్తవ పరిస్థితి బయటపడిరది. గత సంవత్సరంకంటే లక్ష ఎకరాల వరకు వరి తగ్గుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. వేసినా.. పంటల సాగు తగ్గలేదు. జిల్లాలో శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల ఆయకట్టుతో పాటు గుత్ప, అలీసాగర్‌, లక్ష్మి కాల్వల కింద వరి ఎక్కువగా సాగు చేశారు. వీటితో పాటు రామడుగు రిజర్వాయర్‌ కింద వరి వేశారు. జిల్లాలోని ప్రాజెక్టుల ఆయకట్టులేని ప్రాంతాల్లో బోర్ల కింద వరిసాగు కొనసాగించారు. ప్రభుత్వం కొనుగోలు చేయకున్నా ధాన్యాన్ని అమ్ముకునేవిధంగా ఎక్కువ మొత్తంలో సన్న రకాలను వేశారు.

Latest News

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS