Wednesday, April 16, 2025
spot_img

ఆకాల వర్షంతో రైతుల పాట్లు

Must Read
  • వడగండ్ల వర్షంతో రైతులకు తప్పని ఇక్కట్లు
  • పలు ప్రాంతాల్లో తడిసిముదైన ధాన్యం
  • నష్టపరిహారం చెల్లించాలని ప్రతిపక్షాల డిమాండ్‌

ఇప్పటికే వర్షాలు లేక అనేక వ్యయప్రయాసాలకు ఓర్చి ధాన్యంను పండిరచిన రైతుల పట్ల ఇపుడు వరుణదేవుడు కరుణించడం లేదు. అవసరమైన వర్షాలు పడక ఇబ్బందులు పడ్డ రైతులు ఇపుడు కురుస్తున్న ఆకాల వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం నాడు మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని దేవరకద్ర, మన్యంకొండ తదితర ప్రాంతాలలో వడగండ్ల వర్షం కురిసింది. వర్షం కారణంగా చాలా చోట్ల రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిముదైంది. ఒక్కసారిగా వర్షం రావడంతో ధాన్యంను కాపాడుకునే ప్రయత్నంలో రైతులు విఫలం అయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వం కొనుగోళ్ళు చేసే ధాన్యంలో తేమ శాతం తక్కువగా వుండాలనే అదేశాలు వుండడంతో రైతులు వాటిని బహిరంగ ప్రదేశాలలో ఎండబెట్టారు. అదే విధంగా దేవరకద్ర మార్కెట్‌ యార్డుకు ఒక్కసారిగా ధాన్యం ఎక్కువ శాతం రావడంతో ధాన్యం మొత్తం కూడా ఆరుబయటే వుండిపోయింది. సోమవారం నాడు ఉదయం నుండి భానుడు తన ప్రతాపం చూపుతుండడంతో రైతులు వరి ధాన్యంను ఆరబెట్టారు. కాని మధ్యాహ్నం తరువాత వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్యమైన మార్పులు రావడంతో పాటు ఒక్కసారిగా వర్షం కురవడంతో ఎక్కడిక్కక్కడ రైతులు ఆరబెటిన ధాన్యం వర్షానికి తడిసి ముదైంది. దీంతో ఇప్పటికే పంటలు ఎండిపోయి నష్టాల ఊభిలో కూరుకుపోయిన రైతులను వరణుడు మరింత దెబ్బతీయడం వారిని మరింత నష్టాలోకి నెడుతుంది. మార్కెట్‌ యార్డులలో కూడా కనీస సౌకర్యాలు లేకపోవడం పై రైతులు మండిపడుతున్నారు. జిల్లా పరిదిలోని కోడూరు, తెలుగుగూడెం, అప్పాయిపల్లి, ఓబులాయిపల్లి, మన్యంకొండ, కొటకదిర తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. అదేవిధంగా పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా కోతకు సిద్దంగా వున్న ధన్యం కూడా నెలరాలడం జరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు మరింత నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు అవేధన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు క్షేత్ర స్థాయిలో పంటపోలాలను సందర్శించి తడిసిన ధాన్యంతో పాటు నష్టపోయిన రైతాంగాన్ని గుర్తించి నష్టపరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నాయకులు పలు చోట్ల తడిసిన ధాన్యంను, పొలాలను సందర్శించి వారికి తగిన నష్టపరిహారం అందేలా చూడాలని ప్రభుత్వాని డిమాండ్‌ చేశారు.

Latest News

రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం

అనేకకార్యక్రమాలు అమలుచేసి చూపాం సిఎల్‌పి సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS