- నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిన గత పాలకులు
- అక్రమాలకు పాలపడ్డ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి
- బోయినపల్లి సరిత కు ఎగ్జామ్ రాయకుండానే ఏఈ ఉద్యోగం ఎలా దొరికింది
- ఆమెకు ఇంటి దగ్గర కూర్చున్న రూ.1,50,000 లు జీతం ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు
- కొలువుల అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ యువత డిమాండ్
రాష్ట్రంలోని పలు జిల్లాలలోని మున్సిపల్,ఇరిగేషన్,రెవెన్యూ తదితర శాఖలలో గుట్టు చప్పుడు కాకుండా బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ యదేచ్చగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. దీనివల్ల నిరుద్యోగ యువకులు తమకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా నిర్మల్ మున్సిపల్ లో ఏకంగా 44 పోస్టులు భర్తీ చేయడం జరిగింది, దీనికి ఎంక్వయిరీ కమిటీ అధికారికంగా ఆర్డిఓ ని నియమించారు. అయినా కూడా 44 ఉద్యోగాలలో జరిగిన అవకతవకల గురించి ఇంకా పూర్తిస్థాయిలో నేటికీ నివేదిక ఇవ్వలేదు, 44 ఉద్యోగాలను అంగట్లో వేలం వేసి కూరగాయలను అమ్మినట్లు ఉద్యోగాలను అమ్ముకున్నారు. వీటిలో కొన్ని ఉద్యోగాలను అధికారులు లక్షల్లో అమ్ముకోగా, మరి కొన్నింటిని అధికారులు బందు ప్రీతితో తమ అనుయాయులకు కట్టబెట్టినట్లు సమాచారం.

కరీంనగర్ మాజీ ఎంపీ ఇంటి పేరు కలిగియున్న ఓ మహిళ బోయినపల్లి సరిత కు తెలంగాణ జెన్కోలో ఎగ్జామ్ రాయకుండానే ఉద్యోగం దొరికింది..ఈ వ్యవహారం సంచనాలు సృష్టించింది. ఆమెకి ఏఈ పోస్ట్ జెన్కో ప్రభాకర్ రావు ఎలా కట్టబెట్టారు అన్న అంశంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.. అయినా ప్రభుత్వం ఈ అంశంపై ద్రుష్టి సారించకపోవడం విచారకరం.ఆ పోస్టులో ఆమె పనిచేయకుండా ఇంట్లో ఉంటూ నెలకి 1,50,000 జీతం తీసుకున్నట్లు సహచర ఉద్యోగులే ఆరోపించారు. బీఆర్ఎస్ ఓడిపోగానే బోయినపల్లి సరిత ఉద్యోగంలో జాయిన్ కావడంతో అసలు వ్యవహారం బయటకు వచ్చింది.. ఇన్ని రోజులు ఎక్కడ కనిపించలేదు కదా అసలు ఈమె ఎప్పుడు ఎగ్జామ్ రాసింది ఎప్పుడు రిక్రూట్ అయ్యింది.. ఈమె వ్యవహారంపై సహచర ఉద్యోగులు ఆరా తీస్తే కటోరమైన నిజం వెలుగులోకి వచ్చింది,నిజానికి ఏఈ నియామకానికి అవసరమైన చదువు ఈమెకు లేదు,చదువు లేకున్నా ఈమెకు ఏఈగా నియమించేందెవ్వరు,ఉద్యోగమివ్వడమేకాదు నెలకి లక్షన్నర రూపాయలు ఎలా ఇస్తున్నారు..అనే ప్రశ్నలు ..ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.
ఉద్యోగాలు లేక,రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కొందరికి మాత్రం ఎగ్జామ్ రాయకుండానే లక్షలకు పైగా జీతాలు వచ్చే ఉద్యోగాలు ఎలా దొరుకుతున్నాయో అర్ధం కావడంలేదు. నిరుద్యోగులని మోసం చేసిన వ్యవహారంపై ప్రభుత్వం ద్రుష్టి సారించి దోషులు ఎంత పెద్దవారైనా కఠిన చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తోంది.. తెలంగాణ జెన్కోలో ఎగ్జామ్ రాయకుండానే చాలామందికి ఉద్యోగాలు వచ్చాయని, ఈ ఉద్యోగాల వెనుక లక్షల్లో నగదు చేతులు మారిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు,ఈ వ్యహారంలో బోయినపల్లి సరిత ఒక్కరే కాదు
ఐదుగురిని భర్తీ చేసి ఒక్కో పోస్ట్ కి 30 లక్షల వసూలు చేసినట్టు సదరు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఆ ఐదుగురిని జెన్కోలో 2018 ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ట్రైని స్టూడెంట్స్ గా తీసుకొని వీరిని మొదట కాంట్రాక్ట్ ఒప్పందంపై తీసుకొని నెలకి 20వేల వేతనం చెల్లించారు. ఆ తర్వాత వారిని పర్మినెంట్ పేరుతో బీరసారాలడి 30 లక్షల వరకు డిమాండ్ చేసి 2019 డిసెంబర్లో పదవ తేదీన జరిగిన జెన్కో 41వ పాలకమండలి సమావేశంలో వీరిని జన్కోలో విలీనం చేసుకునే ప్రతిపాదన లేవనెత్తి దానికి ఆమోదం లభించేలా చేశారు, దాంతో 2020 మార్చ్ లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (జెఎఓ) గా వీరిని నియమిస్తూ ఉత్తర్వులు వెలబడ్డాయి, 2022 మార్చ్ కల్లా వీరి రెండేళ్ల ప్రోహిబిషనరి పిరియడ్ పూర్తి కావడంతో ఆ కొలువులు పర్మినెంట్ అయ్యాయి. నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తే కనీస అర్హత లేని వారికి శాశ్వత ఉద్యోగాలు దక్కడం జెన్కోలో చర్చనీయాంశంగా మారింది. గత నోటిఫికేషన్లో జరిగిన పరీక్షల్లో వీరంతా అనర్హులు అయినట్టు సమాచారం కాగా వరుస ఆరోపణల నేపథ్యంలో జన్కో డైరెక్టర్ హెస్ఆర్ తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం దొడ్డిదారిన జరిగే బ్యాక్ లాగ్ నియామకాలని అడ్డుకొని, నిరుద్యోగ యువతకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, జిల్లాలలో వివిధ శాఖలలో దొడ్డి దారిన జరిగే నియామకులను అడ్డుకోవాలని విద్యార్థి నిరుద్యోగ యువత కొరుతోంది…