Monday, March 31, 2025
spot_img

అసెంబ్లీలో కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి భట్టి

Must Read

అసెంబ్లీ సమావేశాల్లో చివరిరోజు రేవంత్‌ రెడ్డి సర్కారు గురువారం కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్‌ అకౌంట్స్‌, అప్రోప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదిక సమర్పించగా దానిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందులో 2023-24 బడ్జెట్‌ అంచనా రూ.2,77,690 కోట్లు కాగా, చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లుగా చెప్పారు. గత ఐదేళ్లలో 4లక్షల 3వేల 664 కోట్ల అప్పులు చేసినట్టు సదరు కాగ్‌ రిపోర్టులో వెల్లడైంది. 2023-24 ఏడాదిలో పబ్లిక్‌ మార్కెట్‌ నుంచి రూ. 49,618 కోట్ల అప్పులు తీసుకున్నట్టు కాగ్‌ పేర్కొంది. గత ఏడాది కాలంలో 200 శాతం పరిధి పెరిగినట్లు తెలిపింది. పలు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు రూ.2 లక్షల 20 వేల కోట్లని వెల్లడించింది. వేతనాల కోసం రూ.26,981 కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్‌ రిపోర్ట్‌లో వెల్లడైంది. ప్రభుత్వ ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.89 శాతం నిధులు వస్తున్నాయని, 2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు రూ.9,934 కోట్లని కాగ్‌ వెల్లడిరచింది. రెవెన్యూ రాబడుల్లో 45% సర్కారీ ఉద్యోగుల వేతనాలకు తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చవుతోందని నివేదికలో తెలిపింది. 2023-24లో రెవెన్యూ మిగులు రూ.779 కోట్లని, లోటు రూ49,977 కోట్లుని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.89 శాతం నిధులు వస్తున్నాయని, 2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు రూ.9,934 కోట్లని కాగ్‌ వెల్లడించింది. రెవెన్యూ రాబడుల్లో 45% సర్కారీ ఉద్యోగుల వేతనాలకు తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చవుతోందని నివేదికలో తెలిపింది. 2023-24లో రెవెన్యూ మిగులు రూ.779 కోట్లని, లోటు రూ49,977 కోట్లుని స్పష్టం చేసింది. 2023-24లో స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు రూ.76,776 కోట్లు చెల్లింపులు జరిగాయని, 11% పెరుగుదల స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం నిధుల పెంపుదలగా చెప్పింది. 2022-24లో ప్రభుత్వం తీసుకున్న అప్పు రూ.53,144 కోట్లుగా కాగ్‌ వెల్లడించింది. బడ్జెట్‌ అంచనాలో 79 శాతం వ్యయం అయిందని, ఆమోదం పొందిన బడ్జెట్‌ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం ఖర్చు కాగా, ఇది రూ.1,11,477 కోట్లుగా కాగ్‌ నివేదికలో వెల్లడైంది.

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS