Thursday, April 3, 2025
spot_img

ఆంధ్రలో తొలి బర్డ్‌ఫ్లూ మరణం

Must Read
  • వ్యాధి సోకి చిన్నారి మృతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తొలి బర్డ్‌ ప్లూ మరణం సంభవించింది. పల్నాడు జిల్లా నరసరావుపేటకి చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్‌ ప్లూ వైరస్‌ తో మృతి చెందింది. పచ్చి కోడి మాంసం తినడం వల్ల బర్డ్‌ ప్లూ సోకి మరణించిందని ఎయిమ్స్‌ వైద్యులు ధృవీకరించారు. గత నెల 4వ తేదీన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో మంగళగిరి ఎయిమ్స్‌లో చిన్నారిని జాయిన్‌ చేశారు. చిన్నారి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. అయితే, చికిత్స అందించే సమయంలో చిన్నారి గొంతు, ముక్కు నుంచి స్వాబ్‌ శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపించారు. నివేదిక అనుమానంగా రావడంతో పూణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కు శాంపిల్స్‌ పంపారు వైద్యులు. అయితే, చిన్నారికి హెచ్‌5 ఎన్‌1 వైరస్‌గా నిర్ధారణ అయింది. బర్డ్‌ ప్లూ మృతిగా తేలడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బర్డ్‌ ప్లూ తో మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యుల నుంచి శ్వాబ్‌ శాంపిల్స్‌ డాక్టర్లు సేకరించారు. ముందు జాగ్రత్తగా మరిన్ని వైద్య పరీక్షల కోసం శాంపిల్స్‌ తీసుకున్నారు. శ్వాబ్‌ శాంపిల్స్‌ ను ఎయిమ్స్‌, పూణే వైరాలజీ ల్యాబ్‌ కు అధికారులు పంపనున్నారు. చుట్టుపక్కల ఎవరూ జ్వరంతో బాధపడడం లేదని గుర్తించారు. చిన్నారి కుటుబం నివాసం ఉండే ఇంటికి కిలోవిూటరు దూరంలో మాంసం దుకాణం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మార్చ్‌ 4న పాపకి జ్వరం రావడంతో నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాం.. పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళగిరి ఎయిమ్స్‌ లో జాయిన్‌ చేశారు.. 10 రోజుల చికిత్స తర్వాత పాప చనిపోవడం జరిగింది.. వైద్యులకు అనుమానం వచ్చి పూణే ల్యాబ్‌ కి రక్త నమూనాలు పంపించారు. నిన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటికి వచ్చి విూ పాప బర్డ్‌ ప్లూ వ్యాధితో చనిపోయింది అని చిన్నారి పెద్దనాన్న చెప్పారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS