ఇండియన్ నేవీకి చెందిన సబ్మెరైన్ ప్రమాదానికి గురైంది. గోవా తీరానికి 70 నాటికల్ మైళ్ళ దూరంలో సబ్మెరైన్ ను ఫిషింగ్ బోటు ఢీకొట్టింది. ఈ ఘటనలో బోటులో ఉన్న ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 13 మంది ఉన్నారు. వీరిలో 11 మందిని నేవీ సిబ్బంది రక్షించారు. మరో ఇద్దరి ఆచూకీ గల్లంతు కావడంతో..రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది.
గోవా తీరానికి 70 నాటికల్ మైళ్ళ దూరంలో మార్తోమా అనే పడవ ఇండియన్ నేవీకి చెందిన సబ్మెరైన్ ను ఢీకొట్టినట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని తెలిపింది. ఘటనలో సబ్మెరైన్ స్వల్పంగా డ్యామేజ్ అయిందని వెల్లడించింది.