Friday, April 18, 2025
spot_img

గాయత్రి కళాశాలలో విద్యార్థినులకు ఫుడ్‌ పాయిజనింగ్‌

Must Read
  • ఏడుగురిని ఆసుపత్రికి తరలించిన యాజమాన్యం
  • వాంతులు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చికిత్స
  • విద్యార్థినులు అస్వస్థతపై యాజమాన్యం సైలెన్స్‌
  • హాస్టల్స్‌లో వరుస ఘటనలతో పేరెంట్స్‌లో ఆందోళన

జనగామలోని గాయత్రి కళాశాల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్న 7 గురు విద్యార్థినులను కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. అయితే ఈ ఘటనపై యాజమాన్యం సైలెంట్‌గా ఉండటం విశేషం. వరుస ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటన స్థానికంగా చర్చనీ యాంశంగా మారిం ది. జనగామ జిల్లాలో వరుస ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రైవేట్‌ కాలేజీలకు చెందిన హాస్టల్స్‌లోనే ఈ సంఘటనలు జరుగు తుండటం తలిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల ఏబీవీ కళాశాల హాస్టల్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకోగా. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీ గాయత్రి జూనియర్‌ ప్రైవేట్‌ కళాశాల హాస్టల్‌లో వెలుగుచూసింది.

హాస్టల్‌ విద్యార్థినీలు అందించిన వివరాల ప్రకారం..శ్రీ గాయత్రి జూనియర్‌ ప్రైవేట్‌ కళాశాల హాస్టల్‌లో గురువారం రాత్రి పాలకూర పప్పు తో భోజనం చేసిన విద్యా ర్థినీలకు ఫుడ్‌ పాయిజన్‌ అయ్యింది. హాస్టల్‌లోని 10 నుంచి 15 మంది విద్యారి ్థనీలు అస్వస్థత గురికావడంతో కళాశాల యాజమాన్యం స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీతో రహస్యంగా చికిత్స అందించినట్టు సమాచారం. కానీ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా మారడంతో వారిని వెంటనే ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఏబీవీ బాయ్స్‌ జూనియర్‌ కళాశాల హాస్టల్‌లోనూ ఫుడ్‌ పాయిజన్‌ ..

ఏబీవీ ఘటన మరువక ముందే ఇప్పు డు అదే యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న మరో కళాశాల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కావడం జిల్లాల్లో కలకలం సృష్టిస్తోంది.మరోవైపు విద్యార్థుల ఆరోగ్యం విషయంలో కాలేజీ యాజమాన్యం కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నా రు. ప్రభుత్వం విద్యా సంస్థలకు ఈ నెల 2వ తేదీ నుంచే దసరా సెలువులు ఇచ్చిన ప్పటికీ కళాశాల యజమాన్యం మాత్రం నిబంధనలు ఉల్లంఘించి ఇంకా హాస్టల్‌లోనే విద్యా ర్థినీలను ఉంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. ఇటీవల శ్రీ చైతన్య కాలేజీ ఘటనపై చర్యలు తీసుకున్న మహిళా కమిషన్‌ ఈ ఘటనపై ఎలా స్పందిస్తో వేచి చూడాలి..మరో పక్క ఈ ఘటనపై ఇంటర్‌ బోర్డు, సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది..ఈ సీరియస్‌తో చర్యలు ఉంటాయా.లేదా అనేది వేచి చూడాలి..

Latest News

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు అవార్డ్

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు మరో గౌరవించదగిన గుర్తింపు లభించింది. యూఆర్‌ఎస్ మీడియా మరియు ఆసియా వన్ మ్యాగజైన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 25వ ఆసియన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS