Wednesday, March 12, 2025
spot_img

బంధాలు మరిచి నరహాంతకులై..

Must Read
  • కుటుంబ వ్వస్థలో పెరుగుతున్న అగాథం
  • విషనాగులై కాటేస్తున్న సోంతవాళ్లు

అనుబంధం.. అప్యాయత.. అంతా ఒక నాటకం… అన్న ఒ.. సిని కవి మాటలు నేటి సమాజంలో అక్షర సత్యంగా నిలుస్తున్నాయి. పాలకేడుస్తోందని పాపను పీక పిసికి చంపిన కఠినాత్మురాలు.. భార్యపై అనుమానంతో కన్న బిడ్డల్ని చంపేసిన ఓకసాయి.. తమ అనైతిక బంధాన్ని కళ్లార చూసిన ఓ చిన్నారిని కాటికి పంపిన అన్నా చెళ్లేళ్లు.. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియునితో కలిసి కట్టుకున్న వాడినే కడతేర్చిన ఇల్లాలు.. భార్యపై అనుమానంతో అతికీరాతకంగా హత్యచేసిన భర్త.. ఇలా చేప్పుకుంటే పోతే మానవత్వానికి మచ్చగా నిలుస్తున్న సంఘట నలు ఎన్నో.. ఇలాంటి ఘటనలు నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో అధికంగానే జరుగుతున్నాయి. ఇలాంటి నేరాలపై ఆదాబ్‌ పరిశీలనాత్మక ప్రత్యేక కథనం..

బాంధవ్యాలు కనుమరుగు.!
కంటిని రెప్పలు కాటేస్తే కనుపాపలకు రక్షణేముంది.. కుటుం బంలో ఎవరికైనా ఆపద సంభవిస్తే విలవిల్లాడే పెద్దలే వారి పాలిటా యమ కింకరులైతే ఏంటి ఆ కుటుంబ పరిస్థితి…? గాఢనుంబంధాలతో పెనవేసుకున్న కుటుంబ వ్యవస్థలకు చిరునామ అయిన మన సంస్కృతిలో నానాటికి మానవీయ విలువలు పతనమైపోతున్నాయి. ఎవరినీ ఎవరూ నమ్మలేని పరిస్థితి.. ఉహించని రీతిలో కుటుంబ సభ్యులే తమ పాలిట యమ కింకరులుగా మారుతుండంతో మృత్యువాత పడుతున్న నిస్సహాయులు ఎందరో ఆభం.. శుభం.. తెలియని చిన్నారులను పోట్టన పెట్టుకుంటున్నా హృదయ విధారక సంఘటనలు పెరుగు తుండటం ఆందోళనను రెట్టింపు చేస్తోంది. నగరంతో పాటు శివారు జిల్లాల ప్రాంతాలల్లో ఏటా జరుగుతున్న హాత్యలో సుమారు 30శాతం కుటుంబ సభ్యుల మధ్య చోటుచేసు కుంటున్నవే కావడం గమన్హారం…

వివాహేతర సంబంధాలే అధికం….!
గతంలో ఆస్తి తగదాల నేసథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య తగదాలు చోటుచేసుకొని హత్యలకు దారి తీసేవి. కానీ ప్రస్తుతం వివాహేతర సంబంధాల కారణంగానే ఈ తరహా దారుణాలు అత్యధికంగా చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్ధలో విచ్చినమైన క్రమంలో ఉపాధి కోసం చాల జంటలు కుటుంబ పెద్దలకు దూరంగా నగరంలో ఉండాల్సిన వస్తోంది. ఈ తరహా ఉరుకుల పరుగుల జీవితం సంపాదనపై ఆశాతో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు కోరవడుతున్నాయి. ఇలాం టి సమయంలో ఇరువురికి మధ్య సయోద్య కుదిర్చేవారు కరువ
వ్వడంతో మనస్పర్ధలు పెరిగి పెద్దదవుతున్నాయి. మరోవైపు చాలీ చాలని డబ్బులతో కుటుంబాలు గడవని పరిస్థితుల్లో ఎక్కువ మంది పురు షులు మద్యానికి బానిసలువుతున్నారు. ఇదే క్రమం లో భార్యతో తగువు పడి వారిని శారీరకంగా హింసిస్తున్నారు. ఇలాంటి మహిళలు సినిమాలు పరిసరాల ప్రభావంతో ఏదో ఒక సమయంలో ఇతరుల ఆకర్షణకు లోనవుతుండటంతో వివాహే తర సంబంధాలకు దారితీస్తోంది.ఈ పరిణామాలే తదనంతర కాలంలో జీవిత భాగస్వామిని కడతేర్చే స్థాయికి చేరుకు టున్నా యి. ఇటివల కాలంలో భార్యలు తమ ప్రియుళ్లతో కలిసి భర్తలకు అంత మొదిస్తున్న ఘటనలు ఎక్కువగా సంభవిసు ్తన్నాయనడానికి ఇది ఒక నిదర్శనం. అంతా అయిపో యాక గానీ తామెంత ఘోర తప్పి దానికి పాల్పడ్డమే! వీరు గుర్తిం చలేక పోతున్నారు. దీని వల్ల పిల్లలు అనాథాలుగా మారుతున్నారు.

మచ్చుకకు కొన్ని తాజ సంఘటనలు….!!
హైదరాబాద్‌ పాతబస్తి చాంద్రాయణగుట్ట సెగ్మంట్‌ బండ్లగూడ ఠాణా పరిధి క్రిస్టల్‌ టౌన్‌ షిప్‌లోని ఓ ఆపార్టమెంట్‌లో అద్దెకు ఉంటున్న మసీయుద్దీన్‌ 57, భార్య షబానా, తన కోడుకు సమీర్‌, ఫరీద్‌ తో కలిసి చున్నితో మసీయుద్దీన్‌ కాళ్లు చేతులు, విరచి వేనక్కి కట్టి గోంతుకోసి హతమార్చారు. అయితే షబానా వివాహేతర సంబంధమే హత్యకు కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులు సమీర్‌ 18, ఫరీద్‌ 20, షబానా 36, తదితరులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు..నగర శివారు ప్రాంతం రామచం ద్రాపురం మండలం తెల్లపూర్‌లోని డివినోస్‌ విల్లాస్‌లో ఉంటున్న మల్లారెడ్డి, రాధిక రెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, చిన్న వాడ్కెన కార్తిక్‌రెడ్డి 26, చెడు వ్యవసనాలకు బానిసల్కె దారితప్పాడు. ఆస్థి కోసం గోడవకు దిగి తల్లిని కత్తితో విచక్షణ రహితంగా పోడిచాడు. అడ్డుకో బోయిన తండ్రి చేతులకు గాయాలయ్యాయి. రక్తమోడుతున్న రాధిక రెడ్డిని దగ్గలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచారు.రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మీర్‌పేట్‌ ఠాణా పరిధి జిల్లేలగూడలో నివసించే విశ్రాంత ఆర్మీ జవాను, పుట్టా గురుమూర్తి తన భార్య వెంకట మాధవిపై అనుమానం పెంచు కుని ఆమెను అతికిరాతకంగా ముక్కలు ముక్కలు చేసి హత్య చేశారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు విచారించి నింది తులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇలా చెప్పుకుంటే పోతే నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగడం విస్మయానికి గురిచేస్తున్నాయి.

కుటుంబ వ్యవస్థబలపడాలి…!!
ఒకప్పటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని విలువలు పతనమైపోయాయి. గతంలో మనుషుల కోసం అవసరాలను ఏర్పరచకునేవారు. ఇప్పుడు అవసరాల కోసమే మనుషులను చేరదీస్తున్నారు. తనకు వచ్చిన దాని కోసం భాగస్వామితో సంబంధం లేకుండా వెతుక్కునే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. తన తృప్తికోసం ఏం చేసేందుకైన వెనుకాడని దోరణి నేటితరంలో పెరిగింది. అందుకే వివాహేతర సంబంధాలు ఏర్పడి భాగస్వా మి హత్యలకు దారితీస్తున్నాయి. ఉన్నదానిలోనే సంతృప్తి వెతు క్కోవాలి. భాగస్వామి విషయంలోను ఇలాగే ఆలోచిస్తే చాలవరకు సమస్యలు పరిష్కారమవుతాయి. పూర్వంలా కుటుంబ వ్యవస్థ బలపడి మనుషుల మధ్య దూరం తగ్గాల్సిన అవసరం ఉంది.

Latest News

వీరారెడ్డి సార్ వసూల్ కా బహదూర్..

ప్రయివేట్ పీఏ శివారెడ్డిని పెట్టుకుని వసూళ్ల దందా.. వసూల్ రాజాగా అవతారమెత్తిన పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి ఇక్కడ అక్రమ నిర్మాణాలే ఈయనగారి టార్గెట్.. షెడ్డుకు పర్మిషన్ లేకపోయినా నో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS