Friday, November 15, 2024
spot_img

క్షమించి వదిలేయండి..మంత్రి లోకేష్‎కు శ్రీరెడ్డి లేఖ

Must Read

సినీనటి శ్రీరెడ్డిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితలపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ మచిలీపట్నం తెదేపా సోషల్ మీడియా కన్వీనర్ నిర్మల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. ఇప్పటికే శ్రీరెడ్డిపై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒక కేసు, అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది.

వరుసగా కేసులు నమోదవుతుండంతో శ్రీరెడ్డి స్పందించారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ కు బహిరంగ లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనను క్షమించి వదిలేయాలని, ఇంకెప్పుడూ తప్పు చేయనంటూ నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. శ్రీరెడ్డి రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Latest News

గ్రూప్ 03 పరీక్షకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశాం

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ టీజీపీఎస్సీ ప్రతిపాదించిన ప్రతి సూచనను అధికారులు తప్పకుండా పాటించాలి 33 పరీక్షా కేంద్రాల్లో 9,478, మందికి గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ, అభ్యర్థులు ఉదయం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS