- రూ.20కోట్ల నిధులు కాజేసిన గడల శ్రీనివాస రావుకి వాలంటరీ రిటైర్‌మెంట్ ఎలా..?
- కేంద్రం ఇచ్చే ఎన్‌హెచ్ఎం నిధులు మాయం
- సుమారు రూ.20కోట్ల 40లక్షలు కొట్టేసిన మాజీ హెల్త్ డైరెక్టర్
- ఐఈసీ ప్రింటింగ్ మెటీరియల్ తయారు చేయకుండానే నిధులు స్వాహా
- డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు
- దర్యాప్తులో ఐఈసీ మెటీరియల్ పేరిట నిధులు స్వాహా చేసినట్లు నిర్ధారణ
- గడలను వెనకేసుకొచ్చిన అప్పటి ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్
- మాజీ హెల్త్ డైరెక్టర్ కు రిలీఫ్ ఇస్తూ ప్రొసిజర్ ల్యాప్ సెస్ పేరుతో జీవో 90 విడుదల
- అవినీతి అధికారికి వాలంటరీ రిటైర్‌మెంట్ ఇచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ
తెలంగాణలో పనిచేసిన ఏ అధికారి గురించి గొప్పగా చెప్పాలంటే అరడజను లోపు ఉంటారు. అదీ మంచి, చెడు ఏదైనా కావొచ్చు. అందులో ఒకరే గడల శ్రీనివాస్. మాజీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా పనిచేసిన గడల అవినీతికే పెద్దన్నగా చెప్పుకొవచ్చు. కరోనా సమయంలో ఆయనపై పెద్ద ప్రచారమే జరిగింది. “ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం ” అన్నట్లుగా ఉంది డాక్టర్ పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో మంత్రులు, ఉన్నతాధికారులు పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగా వైద్యశాఖ పెద్దాఫీసర్ అయిన గడల శ్రీనివాస రావు కోట్లాది రూపాయలు సంపాదించాడని తెలుస్తోంది. కోవిడ్ టైంలో మందులు, వ్యాక్సిన్, కరోనా కిట్ లను మాయం చేశాడనే ఆరోపణలు బాగా వచ్చాయి. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సైతం ఇతగాడు కొట్టేశాడంట.
‘అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు’ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా ఉన్న శ్రీనివాస రావు ఆయనే భారీ అవినీతికి పాల్పడ్డాడు. కేంద్రం నుంచి వచ్చిన కోట్లాది రూపాయలను మింగి కూర్చొన్నాడు. కేంద్ర ప్రభుత్వం నుండి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వారు ప్రజలకు రోగాలపట్ల అవగాహన కొరకు ఐఈసీ మెటీరియల్ కోసం రూ.20కోట్ల 40లక్షలు కేటాయించడం జరిగింది. జాతీయ ఆరోగ్య మిషన్ చీఫ్ ప్రోగామి ఆఫీసర్‌గా ఉన్న సమయంలో సుమారు రూ.20కోట్ల 40లక్షలు ఐఈసీ ప్రింటింగ్ మెటీరియల్ తయారు చేయకుండానే నిధులు స్వాహా చేసిర్రని ఆరోపణలు రావడం జరిగింది. ఇట్టి విషయంపై డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దర్యాప్తు చేయడం జరిగింది. గడల శ్రీనివాస రావు చేసిన అవినీతిపై విజిలెన్స్ (రిపోర్ట్ నెం. 10 (సి.నెం.478/విజిలెన్స్ అండ్ ఎంపోర్స్‌మెంట్ / ఈఎన్‌జీ 111/2017) విచారణ చేపట్టింది. ఈ దర్యాప్తులో రూ.20కోట్ల 40లక్షలు ఐఈసీ మెటీరియల్ పేరిట స్వాహా చేసినట్లు నిర్ధారించడం జరిగింది.
స్వాహా చేసిన అప్పటి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గడల శ్రీనివాస రావుపై సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రానికి ఉన్నతమైన దర్యాప్తు సంస్థ ఆరోగ్య శాఖకు నివేదికను సమర్పించడం జరిగింది. కానీ, మాజీ డైరెక్టర్ శ్రీనివాస రావుపై అప్పటి ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి, ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ చర్యలు తీసుకోకుండా జీవో ఆర్.టి. నెం.90 విడుదల చేసి ప్రొసిజర్ ల్యాప్ సెస్ పేరుతో అతని మీద ఉన్నఅభియోగాలను డ్రాప్ చేయడం జరిగింది. గడల శ్రీనివాస్ చేసిన అక్రమాలు ఎన్నో ఉన్నాయి. అయితే గతంలో అసెంబ్లీలో రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతని అవినీతి ఆరోపణలపై, అక్రమంగా డైరెక్టర్ పోస్టులో కొనసాగడంపై ప్రశ్నలు కూడా లేవనెత్తడం జరిగింది. అంతేకాకుండా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గడల అవినీతి చిట్టాపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది.
గడల శ్రీనివాస్ రావు నేషనల్ హెల్త్ మిషన్ నిధులను స్వాహా చేసారని, దర్యాప్తు సంస్థ తెల్చిన, అతనిపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికి, నేషనల్ హెల్త్ మిషన్‌కు యుటిలైజ్ సర్టిఫికేట్ ఏమని సమర్పించారు.. కాగా తెలంగాణ ప్రభుత్వం శ్రీనివాస రావు వాలంటరీ రిటైర్‌మెంట్‌ను చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఎలా అనుమతించారు.. ఈ అనుమతులు ఇవ్వడానికి గడల శ్రీనివాస రావు ఎవరెవరకికి ఎంతెంత ముట్టచెప్పారు.. అతని చేసిన అవినీతి బాగోతంపై మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..
పైసలిస్తే.. దొంగ కూడా దొరే..
గతంలో వైద్యశాఖలో జరిగిన అవినీతిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో విచారణ జరిపి గడల శ్రీనివాస రావుపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని, ఆయనకు అండగా నిలిచిన అప్పటి ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి, ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణపై చర్యలు తీసుకోవల్సిన అప్పటి ప్రభుత్వం అవినీతిలో భాగస్వామ్యం కావడం వల్ల ఎలాంటి చర్యలు తీసుకోకుండా గడల శ్రీనివాస రావుకు అండగా నిలిచిందని బీసీ నాయకురాలు, రిటైర్డ్ పబ్లిక్ హెల్త్ నర్స్ ఎస్.కె. ప్రసన్న ఆరోపించారు. గతంలో తప్పు జరిగిందని, అప్పటి ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి వాస్తవాలను గ్రహించినప్పటికి మళ్లీ అవినీతి అధికారికి దోచుకున్న సర్కార్ సొమ్ము రీకవరీ చేయకుండా, అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకోకుండా వాలంటరీ రిటైర్‌మెంట్‌కు ఎలా అనుమతులు ఇచ్చారు..