కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్‌లోని అయిన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా ఎస్ఎం కృష్ణ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఎస్ఎం కృష్ణ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. 1962లో తొలిసారిగా అయిన రాజకీయంలోకి అడుగుపెట్టారు. 1962 ఎన్నికల్లో మద్దూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1999-2004 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం 2004 నుండి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. బెంగుళూరులో ఐటీ రంగం అభివృద్దికి ఎస్ఎం కృష్ణ విశేష కృషి చేశారు.
ప్రజా వ్యవహారాల రంగంలో ఎస్ఎం కృష్ణ అందించిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 2023లో అయినకు పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.