Wednesday, September 10, 2025
spot_img

వైసిపి అధికారంలోకి వస్తే అంతే సంగతులు

Must Read
  • బాబు సహా అంతా అమెరికా పారిపోక తప్పదు
  • మాజీమంత్రి రోజా హెచ్చరికల వీడియో వైరల్‌
  • మండిపడ్డ టిడిపి, జనసేన నేతలు

రాష్ట్రంలో గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువయ్యారు అంటూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేన నేతలు అమెరికా పారిపోవాలని హెచ్చరించారు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్‌ పారిపోతున్నారని.. రేపు యూఎస్‌ పోతారని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌కు పిచ్చి బాగా ముదిరిందని, ఎక్కడికి వెళితే అక్కడ పుట్టానంటాడని రోజా ఎద్దేవా చేశారు. నగరిలో నిర్వహించిన ’రీకాలింగ్‌ చంద్రబాబు’ కార్యక్రమంలో రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పవన్‌ కల్యాణ్‌కు పిచ్చి బాగా ముదిరింది. పవన్‌ ఎక్కడ పుట్టాడు, ఏం చదువుకున్నాడో ఆయనకే తెలియదు. ఎక్కడికి వెలితే అక్కడ నేను పుట్టాను అంటాడు. ఆఖరికి సుబ్రహ్మణ్య స్వామి అభిమానిని అంటాడు’ అని మాజీ మంత్రి రోజా విమర్శించారు. ’సీఎం చంద్రబాబు లెక్క ఎక్కవగా ఇస్తున్నారు. అందుకే పవన్‌ కళ్యాణ్‌ పిచ్చి బాగా ముదురి పాకం పడింది. చంద్రబాబు, పవన్‌, నారా లోకేష్‌ వీకెండ్‌ నాయకులు. ప్రజలకు రేషన్‌ ఇచ్చే వాహనాలకు డబ్బులు లేవు కానీ.. వీళ్లు మాత్రం హెలికాప్టర్‌, విమానాలలో తిరుగుతున్నారు’ అని ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

రోజా మాట్లాడిన మాటలకు కౌంటర్‌గా రెండు వేలకు ఏ పనైనా చేసే ఆమె రూ.2000 కోట్ల సంపాదించి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందంటూ నగిరి ఎమ్మెల్యే భాను తీవ్ర స్థాయిలో మాట్లాడారు. ప్రజాప్రతినిధుల పై వైసీపీ మాజీ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నామని టీడీపీ, జనసేన నేతలు ఇష్టం వచ్చినట్టు వైసీపీ శ్రేణులపై కేసులు పెట్టి దాడులు చేస్తే తాము వంద రెట్లు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించ్చారు. మా అధినేత జగన్‌ మరోసారి అధికారంలోకి వస్తే.. టీడీపీ నేతలు హైదరాబాద్‌ కాదు.. అమెరికాకు పారిపోతారని.. అవమానిస్తూ మాట్లాడారు.

అయితే, ఆమె నోటి దురుసుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ, జనసేన శ్రేణులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలపై ఏ మాత్రం గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. రోజా తన శాఖల ద్వారా చేసిన అభివృద్ధి శూన్యమని, సభ్యసమాజం తలదించుకునేలా నోరు పారేసుకోవడమే ఆమె పని టీడీపీ నేతలు అంటున్నారు. కాగా, వైసీపీ హయాంలో మాజీ మంత్రి రోజా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమె త్వరలో అరెస్ట్‌ అవ్వడం ఖాయమని టీడీపీ కీలక నేతలు అంటున్నారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This