మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి వెళ్ళే మార్గంలోని టోల్గెట్ ల వద్ద లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఫీజు రద్దు చేస్తున్నట్టు సీఎం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు. సోమవారం అర్ధరాత్రి నుండి ఇది అమల్లోకి రానుంది. ముంబయిలోకి ప్రవేశించే తేలికపాటి వాహనాలకు మొత్తం ఐదు టోల్ గెట్ల వద్ద ఫీజును రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నేడు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.