లయన్స్ భవన్ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్ 320హెచ్ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని డిస్ట్రిక్ట్ 320H లీడర్లు పేర్కొన్నారు.మరోవైపు, నూతనంగా ఏర్పడిన డిస్ట్రిక్ట్ 320H నుంచి ఇమ్మీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మల్టిపుల్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కావడం విశేషం. ఈ అరుదైన ఘనత సాధించినందుకు డిస్ట్రిక్ట్ 320H తరపున డిజి,ఇతర నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయాలు డిస్ట్రిక్ట్ 320Hకు గర్వకారణమని వారు సంతోషం వ్యక్తం చేశారు.