హైదరాబాద్‌లోని తెలంగాణ బిసి కమిషన్ కార్యాలయంలో ఛైర్మెన్‌ను తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మర్యాదపుర్వకంగా కలిసి గంగపుత్రులను ఎంబిసిల జాబితాలో చేర్చాలని వినతి పత్రం అందించారు. అనంతరం తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మాట్లాడతూ, గత ప్రభుత్వం 36 బిసి కులాలను ఎంబిసి జాబితాలో చేర్చుతూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. సాంప్రదాయ మత్యకార గంగపుత్రులు కేవలం చేపల వేటాను కుల వృత్తిగా జీవనం సాగిస్తూ, పేదరికంలో ఉండి విద్య రాజకీయ ఆర్ధిక సామజిక రంగలలో అత్యంత వెనుకబడి ఉన్నారన్నారు. దేశంలో చాలా రాష్టలలో సాంప్రదాయ మత్యకార గంగపుత్ర కులస్తులను ఎస్టీ, ఎస్సీలుగా గుర్తించారని, తెలంగాణలో బిసి ఏ సీరియల్ నెంబర్ ఒకటిలో ఉన్న గంగపుత్రులను ఎంబిసి జాబితాలో చేర్చాలని తెలంగాణ ప్రత్యేక బిసి కమిషన్ ఛైర్మన్‌కు వినతి పత్రం అందించినట్లు తెలిపారు.