నిందితుడి అరెస్ట్, కేసు నమోదు చేసిన ఎస్ఐ నర్సింహారావు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగర్లో గల ఎజెఆర్ చికెన్ షాప్ లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే నమ్మదగిన సమాచారంతో మొయినాబాద్ పోలీసులు దాడి నిర్వహించారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ఎస్ఐ ఆర్.నరసింహరావు నేతృత్వంలో పోలీసులు బుధవారం షాప్ ను పూర్తి తనిఖీ చేయగా 2.5 కిలోల గంజాయి దొరికింది. దీంతో పోలీస్ బృందం షాప్ లో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాగా చికెన్ షాప్ లో ఉన్న మహబూబ్ (25), అజీజ్ నగర్ లో ఉంటూ గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, గంజాయి సరఫరా వెనుక ఉన్న ముఠాను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టామని మొయినాబాద్ ఎస్ఐ నరసింహ రావు తెలిపారు. నిషేధిత గంజాయి, డ్రగ్స్ సప్లయ్ చేసినా, అమ్మినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మొయినాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు హెచ్చరించారు.