మాజీమంత్రి హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్లో హరీష్రావు పేర్కొన్నారు. అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.గత ప్రభుత్వ హయంలో తన ఫోన్ ట్యాపింగ్ చేసి, తనను బెదిరించారని చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు.