Monday, July 21, 2025
spot_img

జీవో 49 రద్దు చేయాలి

Must Read

డిమాండ్ చేసిన దివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక

కొమురం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరుతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన జీవో నెం. 49 ను వెంటనే రద్దు చేయాలని ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక డిమాండ్ చేశారు. మావల మండలంలోని కొమురం భీం కాలనీలో ఆదివాసీ మహిళలతో సమావేశమైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్, 1/70 చట్టం, పేసా చట్టం ప్రకారం ఆదివాసీ భూముల రక్షణకు, ఆదివాసీల హక్కులను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలి. కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవో 49 ద్వారా ఆదివాసీల అస్తిత్వాన్ని, మనుగడను, హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయి. గ్రామ సభల ఆమోదం లేకుండా, ఆదివాసీ చట్టాలను ఉల్లంఘిస్తూ తీసుకొచ్చిన ఈ జీవోను వెంటనే రద్దు చేయాలి,” అని స్పష్టంగా తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ పిలుపు
సోమవారం నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ బంద్ కు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ, ఆదివాసి మహిళా సంఘం, ఇతర ఆదివాసి సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రతి వర్గం ప్రజలు, వ్యాపార వర్తకులు, చిరు వ్యాపారులు, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు, సినిమా థియేటర్లు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు బంద్ కు పూర్తిస్థాయిలో సహకరించాలని గోడం రేణుక కోరారు. “ఇది ఒక్క ఆదివాసీల సమస్య కాదు, రాష్ట్రంలోని ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. అందువల్ల ప్రతి వర్గం, ప్రతి వ్యక్తి బంద్ లో పాల్గొని తమ సహకారం అందించాలి,” అని ఆమె అన్నారు. ఈ బంద్ ను విజయవంతం చేయడానికి ప్రజాస్వామిక వాదులు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక, కర్షక వర్గాలు, వామపక్ష పార్టీలు, రాజకీయ నాయకులు, మేధావులు, బుద్ధిజీవులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆదివాసి హక్కులను రక్షించే ఉద్యమానికి తోడ్పడాలని గోడం రేణుక పిలుపునిచ్చారు. “మన భూములు, మన హక్కులు, మన భవిష్యత్తు కాపాడుకోవడానికి ఈ బంద్ కి ప్రతీ ఒక్కరు వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నాం,” అని ఆమె స్పష్టం చేశారు.

Latest News

మెదడు ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే జీవితానికే ముప్పు!

వేగంగా మారుతున్న జీవనశైలిలో… మెదడు ఆరోగ్యాన్ని మరవొద్దు! తొలినాళ్ల లక్షణాలే హెచ్చరికలు.. వెంటనే స్పందించాలి : కేర్ వైద్యులు మన శరీరాన్ని నియంత్రించే అత్యంత ముఖ్యమైన అవయవం మెదడు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS