టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నటి రష్మిక మందన జంటగా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప పార్ట్ 02 కూడా డిసెంబర్ 05న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో సినిమా బృందం అల్లుఅర్జున్ అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది. పుష్ప 03ది ర్యాంపేజ్ టైటిల్ తో రాబోతుంది. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టూడియోలో సుకుమార్ బృందం బ్యాక్ డ్రాప్లో స్క్రీన్‌పై టైటిల్ లుక్ ఉన్న ఫోటోను షేర్ చేశారు. సీక్వెల్ ఎండింగ్ లో పుష్ప 03 టిజర్ కూడా ఉండబోతుందని సమాచారం.