హైదరాబాద్ రామ్‌నగర్‌లోని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో ఆదివారం బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, సి. కృష్ణ యాదవ్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోనాల ఉత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, అందులో గవర్నర్‌లు, ప్రముఖులు పాల్గొని రాష్ట్రానికి సమృద్ధి, ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు.