Sunday, September 29, 2024
spot_img

కబ్జా చెర వీడిన ప్రభుత్వ భూమి

Must Read
  • మొయినాబాద్‌, క‌న‌క‌మాడి గ్రామశివారులో రూ.30 కోట్ల ప్రభుత్వ భూమి
  • అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసి ఐదెకరాల స‌ర్కార్ భూమి స్వాధీనం
  • సర్వే నెంబర్ 510/పి 5 ఎకరాల భూమిని ఆక్ర‌మించిన క‌బ్జాదారులు
  • కబ్జా చేస్తే జైలుకు పంపిస్తామని తహసీల్దార్ గౌతమ్ కుమార్ హెచ్చరిక
  • కనకమామిడి గ్రామంలో కూడా 4 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ఎట్టకేలకు కబ్జా కోరల్లో నుంచి బయటపడింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండ‌లం కనకమామిడి గ్రామ శివారులోని కోట్ల విలువైన సర్వే నెంబర్ 510/పి 5 ఎకరాల ప్రభుత్వ భూమి రాత్రికి రాత్రే కబ్జా చేసి, ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ నిర్మించి అందులో గదులు నిర్మిస్తున్నారని స్థానిక ప్రజలు ఇచ్చిన సమాచారంతో తహసీల్దార్ కె.గౌతమ్ కుమార్ మండల గిర్దవర్ సుజిత్ రెడ్డి, సర్వేయర్ బి.జలజ లను విచారణ చేసి వెంటనే ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆదేశించారు.

కాగా, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి ప్రక్కన ఉన్న సర్వే నెం.261 పట్టా భూమి పేరు చెప్పి ప్రభుత్వ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి, చుట్టూ ఫెన్సింగ్ వేసి, లే అవుట్ వేసి ప్లాట్స్ గా అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని నిర్దారించారు. ఈ క్ర‌మంలోనే లే అవుట్ లోని అక్రమ నిర్మాణాలు ఫ్రీ కాస్ట్ ఫెన్సింగ్, గదులను జేసీబీ సహాయంతో కూల్చివేశారు.

అనంతరం ప్రభుత్వ భూమి సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. అనంత‌రం అక్ర‌మార్కుల‌పై స్థానిక పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేసి, క‌బ్జాదారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మొయినాబాద్ మండ‌ల‌ తహసీల్దార్ గౌతమ్ కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిర్దావర్ సుజీత్, రెవెన్యూ సిబ్బంది భాస్కర్, భరత్, మహేష్, అమర్ తదితరులు పాల్గొన్నారు.

4 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం
కనకమామిడి గ్రామం, సర్వే నెం 51/4 లో 4 ఎకరాల అసైన్మెంట్ భూమిని పొందిన తొంట అంతయ్య, తొంట నారాయణ, తొంట యాదమ్మ, తొంట జంగయ్య లు అసైన్మెంట్ చట్టానికి విరుద్ధంగా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులకు అమ్మ‌డం జ‌రిగింది. అనంత‌రం రిజిస్ట్రేషన్ పత్రాలు పరిశీలించిన అనంతరం సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ కె. గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ భూమి సర్వే నెంబర్ 51/4 లో 4ఎకరాల భూమిని పిఓటి యాట్ – 1977 ప్రకారం మండల గిర్దావర్ చంద్రమోహన్ స్థానికుల సమక్షంలో పంచనామా నిర్వహించి ఆ భూమిని ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకొని, సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఇదే విధంగా మండలంలో ఎవరు అసైన్మెంట్ భూమి ని అమ్మిన గానీ కొన్న గానీ ప్రభుత్వం అ యొక్క భూమిని స్వాదీనం చేసుకోబడును అని తహసీల్దార్ హెచ్చరించారు.

Latest News

హైపర్‌వర్స్, జి -ఫాల్‎ను రైడ్లను ఆవిష్కరించిన వండర్ లా

వండర్‌లా హైదరాబాద్‌లో రెండు ఉత్సాహపూరితమైన హైపర్‌వర్స్, జి -ఫాల్‎ను రైడ్లను ఆవిష్కరించింది. ఈ రైడ్లను ప్రముఖ సినీ నటుడు నాగ చైతన్య,మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS