తప్పుడు లెక్కలపై నిలదీత
కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అన్నీ తప్పుడు లెక్కలే ఉన్నాయని, ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలపై అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని నిరూపించగలవా అని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు హరీశ్ రావు సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ జరగలేదని మంత్రి శ్రీధర్ బాబు సత్యదూరం మాటలు మాట్లాడారు. నేను ఛాలెంజ్ వేస్తున్నా.. బీఆర్‌ఎస్ హయాంలో 26 వేల ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి.. 8 వేల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, మరో 18 వేల ఉద్యోగాలు గురుకులాల్లో నియామకాలు చేసినం. 26 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తే ఒక్కటి కూడా భర్తీ చేయలేదని శ్రీధర్ బాబు మాట్లాడడం సరికాదు. ఇక రెండో విషయానికి వస్తే.. ఎన్ని స్కూళ్లు మూతపడ్డాయని మా సబితక్క అడిగితే.. 79 స్కూల్స్ తెరిపించామని బాగానే చెప్పారు. కానీ కాంగ్రెస్ పాలనలో మూతబడ్డ 1913 స్కూళ్ల సంగతి ఎందుకు మాట్లాడరని అడుగుతున్నానని మంత్రి శ్రీధర్‌బాబును హరీశ్‌రావు ప్రశ్నించారు.