కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులపై క్యాట్ కీలక వ్యాఖ్యలు చేసింది. డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ వాకాటీ కరుణ, ఆమ్రపాలి, ఏ.వాణి ప్రసాద్ , డీ రోనాల్డ్ రాస్, జీ.సృజన కేంద్ర పరిపాలన ట్రైబ్యూనల్ ను ఆశ్రయించారు.
డీవోపీటీ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ లు దాఖలు చేసిన పిటిషన్లను క్యాట్ తొసిపుచ్చింది. డీవోపీటీ ఆదేశాలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే, అలాంటి చోటుకి వెళ్ళి సేవ చేయాలని లేదా అని ఐఏఎస్ అధికారులను క్యాట్ ప్రశ్నించింది. ఇంట్లో కూర్చొని సేవ చేస్తాం అంటే ఎలా అంటూ క్యాట్ నిలదీసింది. డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఏపీకి వెళ్ళాల్సిందేనని స్పస్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.