- వెల్లడించిన భారత వాతావరణశాఖ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కూరుస్తాయని తెలిపింది.
తెలంగాణలో అదిలాబాద్ , నిర్మల్ , నిజామాబాద్ , రంగారెడ్డి , హైదరాబాద్ , మేడ్చల్ , వికారాబాద్ , సంగారెడ్డి , మెదక్ , కామారెడ్డి , మహబూబ్నగర్ , నాగర్కర్నూల్ , వనపర్తి , జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం, కర్నూల్ , నంద్యాల , అనంతపురం , అన్నమయ్య , చిత్తూరు , తిరుపతి , వైఎస్సార్ జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిసే ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించింది.