- ఉపందుకున్న ఉరేగింపులు..
- దేవాలయాల వద్ద సీసీటీవీ నిఘా..
- ట్రాఫిక్ సజావుగా వెళ్లేందుకు చర్యలు..
హైదరాబాద్ నగరంలో ఏటా అత్యంత వైభవంగా జరిగే బోనాల ఉత్సవాల ఏర్పాట్లకు పోలీస్ శాఖ సర్వసన్నద్దమైంది. ఘటాల ఉరేగింపులు ఉపందుకున్న నేపథ్యంలో భద్రతపై నిశిత దృష్టి సారించింది. భక్తులు ఇబ్బందులు పడకుండా వాహాన రాకపోకలు సజావుగా వెళ్లేందుకు చర్యలు చేపట్టింది. బలిగంప ఉరేగింపులు రాత్రుళ్లు కొనసాగుతున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ బాలస్వామి తెలిపారు. ఆలయాలు మసీదులు ఇతర ప్రార్థనా మందిరాల వద్ద ప్రత్యేక బలగాలను నియమిస్తున్నామని ఆయన వివరించారు. బోనాల ఉత్సవాలు తన పరిధిలోని 228 దేవాలయల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు ఈనెల 21 వరకు కొనసాగునున్నాయి.
ఇప్పటికే ఆలయ నిర్వాహాకులు, పీస్ కమిటీ సభ్యులు, ప్రభుత్వ విభాగాలతో సమన్వయ సమావేశం నిర్వహించమని తన డివిజన్ పరిధిలోని సూల్తాన్ బజార్, అంబర్‌పేట్, చిలకలగూడ, వారసిగూడ, హానుమాన్‌టేకిడి, ఎరియల్లో ఉన్న మహాంకాళీ అమ్మవారు, కట్టమైసమ్మ దేవాలయ వద్ద భత్రను ఏర్పాటు చేసి సందర్శకులకు తీర్థా ప్రసాదాలు అందిస్తున్న సేవకులు.. భద్రత పర్యవేక్షీస్తున్న పోలీసులు అధూనాతన భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసి ఏ చిన్న ఘటన చోటు చేసుకున్నా తెలుసుకునేలా సాంకేతిక భద్రతను వినియోగించుకుని ముందుకు సాగుతున్నా భద్రత అంశపై డీసీపీ డాక్టర్ బాలస్వామితో ఆదాబ్ ముఖా ముఖి…
ప్రశ్న: మీ పరిధిలో ఎన్ని దేవాలయలు ఉన్నాయి..?
డీసీపీ : మా పరిధిలో దాదాపు 228దేవాయల్లో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు ఈ నెల 21 తేది వరకు కొనసాగనున్నాయి.
ప్రశ్న : పోలీసు పికెట్లు పెట్టారా..?
డీసీపీ : తొట్టేల ఉరేగింపులకు అవసరమైన తొట్టేలను తయారు చేసే యూనిట్లు వద్ద పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. తొట్టేల ఉరేగింపులు ప్రారంభమయ్యే చోట్ల పోలీసులు వాటి వెంట ఉంటారు..
ప్రశ్న: సీసీ టీవీ నిఘా, మహిళ పోలీస్ భద్రత ఉందా…?
డీసీపీ : బోనాల పండగ సందర్భంగా బలిగంప ఉరేగింపులు వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. అన్ని దేవాలయాల్లో భక్తులతో కిటకిటలాడే అవకాశాలున్నాయి. ఇందు కోసం ప్రతి దేవాలయం వద్ద బందోబస్తుతో పాటు మహిళ పోలీసులు రక్షణగా నియమించారు. వీటితోపాటు సీసీటీవీ నిఘా భద్రతను ఏర్పాటు చేశాం.
ప్రశ్న : పెట్రోలింగ్, గస్తీ ని పెంచారా..?
డీసీపీ : బోనాల ఉరేగింపు సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో రాకపోకలపై అంక్షలు విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రతి గల్లీలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రాకపోకలు సజావుగా వెళ్లేందు ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పటికే సిద్దం చేశాం. ముఖ్య మైన దేవాలయ వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాం.
సాంకేతికతో వేగ స్పందన..
డివిజన్ వారీగా ప్రతి ఠాణా పరిధిలో ఇన్‌స్పెక్టర్, ఆ ఇన్‌స్పెక్టర్ పరిధిలోని దేవాలయలు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ప్రతి దేవాలయ మండపం వద్ద ఫలానా ఎస్‌ఐ లేదా కానిస్టేబుల్ ఉంటారని వారి పేరు ఫోన్ నెంబర్లు పోందుపరిచి ఒకే డేటాను రూపొందిస్తున్నారు. అదనపు బలగాలు వచ్చిన వెంటనే ఠాణాల పరిధుల్లోని కంప్యూటర్లలో వారి వివరాలు నమోదువుతాయి. బందోబస్తు విధులు నిర్వహించేవారిని ఏసీపీ డివిజన్ వారీగా వర్గీకరించి వారికి ఫలానా చోట విధులు నిర్వహించాలన్నది దీని ద్వారానే నిర్ణయమవుతుంది. నగర పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ఇన్‌స్పెక్టర్ వరకూ వేర్వేరు పాస్‌వర్డల ద్వారా ప్రతి ఠాణా పరిధిలో ఎక్కడ ఏవరు విధులు నిర్వహిస్తున్నారో కంప్యూటర్ ద్వారా తెలుసుకోవచ్చును. అదనపు సమాచారం అందించాలన్నా, ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుని అవకాశాలున్నాయని అనుమానాలు వచ్చినా వెంటనే అప్రమత్తం చేస్తూ వాట్సాప్ సంక్షీప్త సందేశాలు ఆధునిక సాంకేతిక ద్వారా బందోబస్తు అధికారులు సిబ్బంది ఫోన్లకు వెళతాయి. వాటి ఆధారంగా వెంటనే స్పంధించి అందకు అనుగుణంగా చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే అదనపు డీసీపీతో కలిసి వివిధ ఎరియల్లో ఉన్న దేవాలయాలను సందర్శంచి భద్రతను పరిశీలించడం జరిగిందన్నారు.