Sunday, November 24, 2024
spot_img

నవంబర్ 26న జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం

Must Read

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఏంఏం) పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. దీంతో ఈ నెల 26న నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తేజస్వి యాదవ్, దీపాంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొంటారు.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జెఎంఎం నేతృత్వంలోని కూటమి విజయం సాధించడం ద్వారా సోరెన్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమైంది. జెఎంఎం, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‎జేడీ), సీపీఐతో కూడిన కూటమి 81 స్థానాల్లో 56 సీట్లు గెలుచుకుంది.

Latest News

విజయం సాధించడానికి మహాయుతి కూటమి ఏం చేసింది

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే స్పందించారు. ఎన్నికల ఫలితాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS