- ప్రారంభించిన ప్రముఖ సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ…
- క్రమక్రమంగా అంతేరా శాఖలను పెంచుకోవడం సంతోషంగా ఉంది
అసాధారణమైన వంటకాల అనుభవాలకు పర్యాయపదంగా పేరుగాంచిన అంతేరా కిచెన్ & బార్ నగరంలోని కొంపల్లికి తన పరిధిని విస్తరించింది. నగర నడిబొడ్డున తెలుగు రుచుల గొప్ప వైవిధ్యాన్ని పరిచయం చేసిన అంతేరా విభిన్న ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నటుడు నిఖిల్ సిద్ధార్థ.. ఈ పసందైన రుచులకు గ్లామర్ పెంచడంతోపాటు డెలిషియస్ సాయంత్రంగా మార్చారు. తెలుగు సంస్కృతి, స్థానిక వంటకాల వారసత్వం యొక్క అద్భుత వేడుకగా నిలిచిన ఈ కార్యక్రమం.., రెడ్ కార్పెట్ స్వాగతం, విలాసవంతమైన విందులు, ఈ ప్రాంతం యొక్క ప్రామాణికమైన సారాంశంతో ప్రతిధ్వనించే వాతావరణం నెలకొల్పింది. కొంపల్లిలో కొత్త రెస్టారెంట్‌ను పరిచయం చేస్తున్నందుకు అంతేరా భాగస్వాములు ఆశిష్ రెడ్డి, అనురాగ్ రెడ్డిలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేరా అనే పేరు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ వంటకాల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది.
కొంపల్లిలో కొత్త శాఖను ప్రారంభించడం పట్లటాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ., “అంతేరా కుటుంబంలో భాగమైనందుకు, క్రమక్రమంగా మరొక శాఖను ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేరా వ్యవస్థాపకులు ఇంత తక్కువ వ్యవధిలో శాఖలను పెంచుకోవడం నేను చూశాను. ఈ నేపథ్యంలో మొత్తం అంతేరా బృందానికి శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరాల్లో వారు మరింత అభివృద్ధి చెందుతూ వారి విస్తరణను కొనసాగించాలని కోరుకుంటున్నాను. అంతేరా ఖచ్చితంగా నగరంలోని ఆహార ప్రియులకు ఒక ప్రసిద్ధ ప్రదేశం. వారు తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ప్రాంతం నుండి వైవిద్యమైన అనేక రకాల వంటకాలను అందిస్తార” తెలిపారు.
అంతేరా కిచెన్ & బార్ భాగస్వాములలో ఒకరైన ఆశిష్ రెడ్డి మాట్లాడుతూ., “కొంపల్లికి తెలుగు వంటకాల రుచులను తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాము. అంతేరా కేవలం రెస్టారెంట్ మాత్రమే కాదు… ఇది మూడు తెలుగు ప్రాంతాల గొప్ప వారసత్వ ప్రయాణానికి ప్రయత్నానికి నిదర్శనం. మేము పురాతన వంటకాలు, పురాతనమైన రుచికరమైన వంటకాల మెనూను క్యూరేట్ చేసాము. మీ ఆహార ఆసాధనకు మరపురాని సాహసయాత్రను పరిచయం చేస్తామని” అన్నారు.
“తెలుగు సంప్రదాయాల ఆత్మను ప్రదర్శించే ఆహ్వానించే వాతావరణాన్ని అందించడమే మా లక్ష్యం” అని అంతేరా భాగస్వామి అనురాగ్ రెడ్డి అన్నారు. వంటకాలపై నిశితమైన శ్రద్ధ, మా పాక శాస్త్ర మూలాల పట్ల లోతైన మక్కువతో, మేము ఆధునిక, ప్రామాణికమైన భోజన అనుభవాన్ని రూపొందించామని ఆయన వివరించారు.
కొంపల్లిలోని అంతేరా కిచెన్ & బార్ ఒక కిచెన్ ల్యాండ్‌మార్క్‌గా మరియు తెలుగు వంటకాల యొక్క విశిష్టమైన నోరూరించే రుచులను ఆస్వాదించడానికి ఒక ప్రదేశంగా ఉంటుందని హామీ ఇస్తుంది.