- హైడ్రా బాధితులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు
- ఇళ్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా..?
- రాజకీయ నాయకులను సంతృప్తిపరిచేందుకు, ఉన్నతాధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయొద్దు
- శని, ఆదివారాల్లో ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు
- అధికారులు చట్టనికి వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు
- హైడ్రా కూల్చివేతల పై హైకోర్టు ఆగ్రహం
హైడ్రా కూల్చివేతల పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతల పై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. బాధితుల దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరై వివరణ ఇచ్చారు.
ఇళ్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా అని హైకోర్టు రంగనాథ్‌ను ప్రశ్నించింది. రాజకీయ నాయకులను సంతృప్తిపరిచేందుకు, ఉన్నతాధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయొద్దు అని సూచించింది. శని, ఆదివారాల్లో ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రెండు రోజుల్లో కూల్చివేతలు చేపట్టొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది. కోర్టు తీర్పు ఉన్న విషయం కూడా తెలియదా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు చట్టనికి వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు అని హెచ్చరించింది.
నిబంధనలు పాటించకపోతే హైడ్రా ఏర్పాటు జీవో పై స్టే ఇవ్వాల్సి వస్తుందని తెలిపింది. స్థానిక సంస్థలు అనుమతి ఇస్తేనే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా అక్రమాలు ఎలా తెలుస్తారని అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది.