Sunday, April 13, 2025
spot_img

జీహెచ్ఎంసీ చరిత్రలోనే అత్యధికంగా పన్ను వసూళ్ల రికార్డు

Must Read

అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, మెమోంటోలు అందజేసి, అభినందనలు తెలిపిన జిహెచ్ఎంసి కమీషనర్

ఆస్తిపన్ను వసూళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) రికార్డ్ స్థాయిలో అద్భుతమైన వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించిందని జిహెచ్ఎంసి కమీషనర్ ఇలంబర్తి అన్నారు. 2 వేల కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలు చేయడంలో క్షేత్రస్థాయి అధికారులు బాగా పని చేశారని అన్నారు. జిహెచ్ఎంసికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి రికార్డ్ స్థాయిలో ఆస్తి పన్ను వసూల్లైన నేపథ్యంలో, అందుకు కృషి చేసిన రెవెన్యూ అధికారులు, బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, ఏ.ఎం.సి లు, డిప్యూటీ కమిషనర్లకు శుక్రవారం బంజారా హిల్స్ లోని బంజారా భవన్ లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ… గతంలో ఎప్పుడూ వసూలు కానంతగా రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం లక్ష్యాన్ని మించి పన్ను వసూలు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పన్ను వసూలు ఎంత ఎక్కువగా వస్తే ప్రజలకు అంత బాగా సేవలు అందించవీలుంటుందన్నారు. ఎన్నో అభివృద్ధి పనుల ద్వారా ప్రజలకు మౌలిక వసతులు కల్పన, సుస్థిర అభివృద్ధి జరగాలంటే పన్నుల వసూలు సవ్యంగా కావాలన్నారు.

ఆస్తి పన్ను బకాయిలపై వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) పథకం అమలుతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. అధికారులు, ఆయా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడంతో ఈ ఏడాది అత్యధికంగా పన్ను వసూలైందని తెలిపారు. పూర్తి బాధ్యత, శ్రద్ధతో పన్నుల వసూళ్లలో భాగస్వాములైన వివిధ కేటగిరీ ఉద్యోగులు, అధికారులను ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా కమీషనర్ అభినందించారు.

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రూ. 121 కోట్లకు పైగా ఆస్తిపన్ను అదనంగా వసూలైందన్నారు. గత ఆర్థిక సంవత్సరం 2023-2024 లో ఆస్తి పన్ను రూ. 1917 కోట్లు వసూలు కాగా, 2024-2025 ఆర్థిక సంవత్సరం 2038 కోట్ల రూపాయలకు పైగా పన్ను వసూలైందన్నారు. ఎస్టేట్ విభాగం నుండి కూడా ఈ సంవత్సరం రెవెన్యూ పెరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా అత్యధికంగా పన్ను వసూళ్లు చేసిన బిల్ కలెక్టర్లకు, ట్యాక్స్ కలెక్షన్ ఇన్స్పెక్టర్లకు, డిప్యూటీ కమిషనర్ లకు, ఏ.ఎం.సి లకు, జోనల్ కమిషనర్ లకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేసి కమీషనర్ అభినందనలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26కు గాను 3వేల కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల అంచనా లక్ష్యం గా ముందుకు వెళుతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్లు అనురాగ్ జయంతి, వేణుగోపాల్ రెడ్డి, రఘు ప్రసాద్, వేణుగోపాల్, సామ్రాట్ అశోక్, సరోజ, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, ఉపేందర్ రెడ్డి, రవికిరణ్, వెంకన్న, సిసిపి శ్రీనివాస్, జాయింట్ కమిషనర్ మహేష్ కులకర్ణి, డిప్యూటీ కమిషనర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, ఏ.ఎం.సి లు, బిల్ కలెక్టర్లు, ఐటి విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

నిరుద్యోగి జీవితం..

ఈ జీవితంలో రోజులు గడిచేలా ఖాళీ క్యాలెండర్ పేజీలు మాత్రమే మిగులుతాయి. కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం కూడా అలసటతో నీరసపడుతుంది. కానీ… ఈ అంధకారంలోనూ ఒక చిన్న...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS