Thursday, September 4, 2025
spot_img

ఒక ప్రశ్నా పత్రానికి బదులు.. మరో పశ్న్రా పత్రం

Must Read
  • పదో తరగతి విద్యార్థులు షాక్‌..
  • రెండుగంటల సమయం వృథా
  • విచారణకు ఆదేశించిన కలెక్టర్‌

అధికారుల నిర్లక్ష్యంతో మెయిన్‌ పరీక్షల్లో కొన్నిసార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈకమ్రంలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఎగ్జామ్‌సెంటర్‌ పరీక్ష రాయటానికి కూర్చున్న విద్యార్థులకు ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రాన్ని ఇవ్వడంతో విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాయ్స్‌ హైస్కూల్‌ పరీక్ష కేంద్రంలో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష హాల్లో తమకు కేటాయించిన సీట్లలో కూర్చుకున్నారు. పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యాయి. అక్కడి ఇన్విజిలేటర్లు ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చారు. అయితే ఆ ప్రశ్నాపత్రాన్ని చూసి విద్యార్థులంతా అవాక్కయ్యారు. ఏంటిది అంటూ ఒకింత భయాందోళనకు గురయ్యారు. ఒక ప్రశ్నాపత్రానికి బదులుగా మరో పేపర్‌ను అధికారులు పంపిణీ చేశారు. విద్యార్థులు దాన్ని గుర్తించి చెప్పడంతో అధికారులు హైరానా పడ్డారు. హడావుడిగా మరో పేపర్‌ తెప్పించడంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే ప్రశ్నాపత్రం తారుమారైన విషయం కలెక్టర్‌ దృష్టికి వెళ్లింది. దీంతో ప్రశ్నాపత్రాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం, పరీక్ష ఆలస్యంపై కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. ఒక ప్రశ్నాపత్రం బదులు మరో పేపర్‌ రావడంతో వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా డీఈవోకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS