Wednesday, April 16, 2025
spot_img

ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. చిత్రహింసలే

Must Read

గర్భిణి గొంతు నులిమి హత్యచేసిన భర్త

విశాఖనగరంలోని మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. నిండు గ‌ర్భిణి భ‌ర్త చేతిలో హత్యకు గురయ్యింది. స్థానిక ఆర్టీసీ కాలనీలో నిండు గర్భిణి హత్యకు గురయ్యారు. పీఎంపాలెం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ కాలనీలోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో జ్ఞానేశ్వర్‌, అతడి భార్య అనూష (27) నివసిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. ఏదో విషయంలో సోమవారం ఉదయం వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో జ్ఞానేశ్వర్‌.. ఆమె గొంతు గట్టిగా నొక్కేశాడు. దీంతో ఆమె ఊపిరి అందక అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే స్థానికుల సాయంతో ముందుగా ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి కేజీహెచ్‌కు అతడే తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనస్పర్థలు కారణంగా భార్య అనూషకు భర్త జ్ఞానేశ్వర్‌ మధ్య గొడవ తలెత్తింది. రెండు ఏళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా.. ఈ అంశంపై తాజాగా ఆమె స్నేహితులు కీలక విషయాలు వెల్లడించారు. రెండేళ్ల క్రితం సింహాచలంలో లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారని చెప్పారు. మృతురాలు అనూష తండ్రి చనిపోయారు, తల్లికి ఆరోగ్యం బాగోలేక మూడేళ్లగా కోమాలో ఉందన్నారు. జ్ఞానేశ్వర్‌ అతని కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు.. భార్యను బయటకు ఎక్కడికి తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదు. జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు. గతంలో కూడా పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు.. ఫలుదాలో ఓసారి టాబ్లెట్స్‌ కలిపి చంపాలి అనుకున్నాడు.. మాకు సమాచారం వచ్చి వెళ్లే చూసే సరికి బెడ్‌ విూద విగత జీవిగా పడి ఉంది.. ఈ రోజు డెలివరీ ఉందని నిన్న ఫ్రెండ్స్‌ అందరికీ వీడియో కాల్‌ చేసింది.. రాత్రికి రాత్రి చున్నీతో గొంతు బిగించి చంపేశాడు. భర్త జ్ఞానేశ్వర్‌ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నాయి.. అని బాధితురాలి స్నేహితులు వెల్లడించారు.

Latest News

రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం

అనేకకార్యక్రమాలు అమలుచేసి చూపాం సిఎల్‌పి సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS