Saturday, April 19, 2025
spot_img

రూ.6500కోట్ల నష్టాల్లో మెట్రో

Must Read
  • మెట్రో చార్జీల పెంపుకు తథ్యం అంటున్న ఎల్‌అండ్‌టీ సంస్థ
  • రూ.59 హాలిడే కార్డుతో పాటు 10శాతం రాయితీ ఎత్తివేత
  • బెంగళూరులో ఇప్పటికే 44శాతం పెంచిన మెట్రో

నష్టం పేరుతో మెట్రో చార్జీలను పెంచేందుకు ఎల్‌అండ్‌టీ మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సంస్థ రూ.6500కోట్ల భారీ నష్టాల్లో వున్నట్లు మెట్రో సంస్థ పేర్కొంది. కోవిడ్‌ సమయంలో ఎల్‌అండ్‌టీ సంస్థ తీవ్రంగా నష్టపోయామని ఈ నేపథ్యంలో అప్పటి నుండి కూడా చార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. అయితే గత ప్రభుత్వం మెట్రో చార్జీల పెంపు విషయంలో సుముఖత చూపకపోవడంతో అది వాయిదా పడుతూ వచ్చింది. కాని ప్రస్తుత పరిస్థితుల్లో చార్జీలు తప్పదని సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇటీవల బెంగళూరులో 440శాతం మెట్రో చార్జీలు పెంచడంతో హైదరాబాద్‌లో కూడా చార్జీలను ఎంత పెంచాలనే యోచనలో ఎల్‌అండ్‌టి మెట్రో సంస్థ ఆలోచిస్తుంది. ఇప్పటికే ఎల్‌ అండ్‌టీ సంస్థ నష్టాల పేరుతో గతంలో వున్న రూ.59 హాలిడే సేవకర్‌ కార్డును రద్దు చేయడంతో పాటు మెట్రో పై రద్దీ వేళల్లో 10శాతం రాయితీని కూడా ఎత్తివేసింది.

Latest News

బ‌రితెగించిన ఇరిగేష‌న్‌

ప‌త్తుల‌గూడ‌ చెరువు క‌బ్జాకు గురైంద‌ని తెలిస‌న కూడా చ‌ర్య‌లు చేప‌ట్ట‌ని ఇరిగేష‌న్ శాఖ‌ మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా ఉప్ప‌ల్ మండ‌లం ప‌త్తుల గూడ‌లో అక్రమార్కుల ఇష్టారాజ్యం సుమారు 10...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS