Friday, November 22, 2024
spot_img

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను

Must Read

తిరుమల కల్తీ లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. లడ్డూ వివాదం పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి,జస్టిస్ కెవి విశ్వనాథన్‎లతో కూడిన ధర్మాసనం లడ్డూ వివాదంపై విచారణ జరిపింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బృందంలో సీబీఐ నుండి ఇద్దరు , రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్ ఎస్‎ఎస్‎ఏఐ నుండి ఒక అధికారి సభ్యులుగా ఉండాలని తెలిపింది. స్వతంత్ర సీట్ బృందం దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని ఆదేశించింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో స్వతంత్ర దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించినట్లు జస్టిస్ బీఆర్ గవాయి , జస్టిస్ కేవీ విశ్వనాథన్ బెంచ్ తెలిపింది. తిరుమల లడ్డూ వ్యవహారం పొలిటికల్ డ్రామాకు దారితీయాలని తాము భావించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యనించింది.

ఈ మేరకు స్పందించిన సీఎం చంద్రబాబు ” తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై దర్యాప్తుకు సీబీఐ , ఏపీ పోలీసులు , ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో కూడిన సీట్‎ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను స్వాగతిస్తున్నాను..సత్యమేవ జయతే..ఓం నమో వెంకటేశాయ”అని ట్వీట్ చేశారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS