భారతదేశంలోని మొట్టమొదటి ఆర్గానిక్ క్రీమరీ ఐస్‌బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్, బేగంపేట్‌లో తమ మూడో ఔట్‌లెట్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. రూ. 1కే గ్రాము ఆర్గానిక్ ఐస్ క్రీం అందిస్తున్న ఈ స్టోర్‌ను సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, పోలీస్ అధికారులు, జర్నలిస్ట్ స్వప్న ప్రారంభించారు. 2013లో స్థాపితమై, 2018 నుంచి పూర్తిగా ఆర్గానిక్‌గా మారిన ఐస్‌బర్గ్, ఏ2 దేశీ ఆవు పాలు, బెల్లం, కొబ్బరి చక్కెర వంటి సహజ పదార్థాలతో ప్రిజర్వేటివ్-రహిత ఐస్ క్రీమ్‌లను అందిస్తోంది. 40+ ఆర్గానిక్ టాపింగ్స్, డెత్ బై చాక్లెట్ సండే, ఆర్టిసానల్ కేక్స్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోంది. బేగంపేట్ ఔట్‌లెట్ లగ్జరీ లాంజ్ కాన్సెప్ట్‌తో ప్రీమియం డెజర్ట్ అనుభవాన్ని అందిస్తుంది. 100+ సేంద్రీయ రైతులతో భాగస్వామ్యంతో నాణ్యమైన పదార్థాలను సేకరిస్తూ, ఐస్‌బర్గ్ హైదరాబాద్‌లో కేపిహెచ్బీ, మాదాపూర్ స్టోర్స్‌తో సహా దేశవ్యాప్తంగా 72 ఔట్‌లెట్స్‌లో సేవలు అందిస్తోంది. ఫౌండర్ సుహాస్ మరిన్ని స్టోర్స్‌తో విస్తరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.