- టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
గ్రూప్ 01 విషయంలో విపక్షా పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఆదివారం గాంధీభవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, విపక్షా పార్టీ ఉచ్చులో నిరుద్యోగులు పడొద్దని అన్నారు. జీవో 29తో అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదని, జీవోపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. బిజెపి, బీఆర్ఎస్ పార్టీ కుమ్మకై అభ్యర్థులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. గ్రూప్ 01 పరీక్షలు రాయడానికి వేలాది మంది అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని, ఏ ఒక్క అభ్యర్థికి కూడా అన్యాయం జరగదని స్పష్టం చేశారు.
ఏడాదికి 02 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు.గత పదేళ్ళలో బిజెపి పార్టీ ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గడిచిన పదేళ్ళలో బీఆర్ఎస్ ఒక్కసారి కూడా గ్రూప్ 01 నోటిఫికేషన్ ఇవ్వలేదని అన్నారు.