- అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
- డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలనే ప్రతిపాదనకు ఆమోదం
- 7,65,705 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ప్రయోజనం
- సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ మల్లు రవి, సంబంధిత అధికారులు
రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహలలో ఉంటున్న విద్యార్థిని, విద్యార్థులకు పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అమలులో ఉన్న డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలని అధికారుల నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలు పంపగా, సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారు. డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచడం ద్వారా రాష్ట్రంలో 7,65,705 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎంపీ మల్లు రవితో పాటు సంబంధిత అధికారులు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.