మేడ్చల్ పట్టణంలో ఉన్న సి.ఎమ్.ఆర్ (CMR School) పాఠశాలలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను (Independence Day Celebrations at CMR School) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కె. గోవర్థన్ రెడ్డి, శ్రీశైలం సౌజన్య రెడ్డి, విద్యార్థుల వందనాన్ని స్వీకరించి పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేశి, ఆడిటోరియంను ప్రారంభించా రు. ఈ సందర్భంగా వారు మీడియాతో విష్ణువర్ధన్ మాట్లాడుతూ ఇచ్చిన పనిని సక్రమంగా నిర్వర్తించడమేన్ విజయానికి సోపానమని తెలియచేసారు. అనంతరం శ్రీశైలం రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమర యోధులు దేశ స్వాతంత్య్ర సిద్ధికోసం చేసిన త్యాగాలకు విద్యార్థులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవా లని పిలుపునిచ్చారు. మహానుభావుల కలల సాకారానికి అందరు కృషి చేయాలని కోరారు. సంస్థాగత దినోత్సవంలో భాగంగా ఎన్నికైన విద్యార్ధి నాయకులను సత్కరించి, బాధ్యతలను అప్పగించారు .సౌజన్య రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్యం సమష్టి కృషి వల్ల సాధించబడినదని, దానిని నిలుపుకోవడానికి విద్యార్థులు ఐకమత్యంగా ఉండాలని అన్నారు, విద్యార్థులు చదువుతో పాటు వివిధ అంశాలలో ఉన్నతిని సాధించాలని తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య రేఖా తివారి మాట్లాడుతూ నాయకుడు అనేవాడు సమాజంలోని నూన్యతాభావాన్ని పోగొట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల (CMR School) ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.