భారత్ అప్రమత్తంగానే ఉందన్న జైశంకర్
అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. దీంతో ప్రపంచం తీవ్ర గందరగోళానికి గురైతుంది. ఇక, ఈ వివాదంపై న్యూఢిల్లీలో జరిగిన కార్నెగీ ఇండియా గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్‌లో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. భారతదేశం తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. రెండు అతి పెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య పరంగా నువ్వానేనా అన్నట్లుగా సుంకాల యుద్దం సాగుతోందన్నారు. జనవరి 20వ తేదీన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగాఅధికారం చేపట్టిన వెంటనే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం వాషింగ్టన్‌తో చర్చలను వేగవంతం చేశామని కేంద్రమంత్రి జైశంకర్ అన్నారు. కానీ, ట్రంప్ తన మొదటి పదవీకాలం సమయంలో వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చక పోవడంతో ఇండో- అమెరికా వాణిజ్య విధానంపై తీవ్రమవుతున్న అనిశ్చితి నెలకొందన్నారు. కాగా, ఇప్పుడు మాత్రం ఆ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ప్రయత్నిస్తోందని తేల్చి చెప్పారు. అయితే, ప్రస్తుతం అమెరికాలో ఆందోళనకర వాతావరణం నెలకొనడంతో.. చర్చల్లో వేగం తగ్గిపోయిందన్నారు. అయితే, యుఎస్-చైనా మధ్య సంబంధాలు చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక, 1947లో భారత్ కి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అమెరికా- చైనా మధ్య తీవ్రమైన పోటీ ఉండేది.. ఆ పోటీలో మేము చిక్కుకు పోయామన్నారు.. కాగా, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్నది వాణిజ్యం, రాజకీయం, రక్షణ సమస్య కాదు.. ఇది చాలా సున్నితమైన అంశమని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు.