Sunday, August 17, 2025
spot_img

భారత్ ప్రపంచ శాంతి దూత

Must Read

జాతీయ సమైక్యతా సంఘటన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరికిపండ్ల అశోక్

అంతర్జాతీయ చట్ట సూత్రాలను రక్షించడం, సామూహిక విధ్వంసక ఆయుధాలను నిర్మూలించడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, మానవ హక్కులను రక్షించడం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో న్యాయం సాధించడం, ప్రపంచ దేశాల మధ్య ప్రజాస్వామి కరణను పెంచుకోవడం లక్ష్యాలుగా భారత్ ముందుకు పోతుందని, విశ్వగురు పాత్రకు ఇదే అసలు సిసలైన సమయమని, భారత్ మాత్రమే ప్రపంచ శాంతి దూత పాత్ర పోషించగలరని జాతీయ సమైక్యత సంఘటన జాతీయ ప్రధాన కార్యదర్శి, జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. ప్రపంచంలో ఆధిపత్య పోరుకు నడుంబిగించిన రెండు అగ్ర రాజ్యాల క్రీడలో ఇరాన్ మరియు ఇజ్రాయిల్ నలిగిపోతున్నాయని, అమెరికా దాడుల అనంతరం ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన భారత ప్రధాని మోదీ యుద్ధ విరమణకు ఒప్పించే ప్రయత్నాలు చేశారని, దీంతో భారత్ ఏదో ఒకవైపు నిలబడి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని తేలిపోయిందని, ఇరువైపులా శాంతిస్థాపన భారతదేశ లక్ష్యమని ప్రపంచానికి స్పష్టమైందని, దీంతో భారత్ కు ప్రపంచ శాంతి దూతగా గుర్తింపు లభించిందని డాక్టర్ అశోక్ పేర్కొన్నారు.

స్వాతంత్రం వచ్చినప్పటినుండి భారత్ ఓ ప్రత్యేక విదేశాంగ ఆలీన విధానాన్ని పాటిస్తోందనీ ,రెండో ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ0 రెండు గ్రూపులుగా విడిపోయినప్పుడు అమెరికా, సోవియట్ల మధ్య చిన్నచితకదేశాలు అతలాకుతులమయ్యాయి, స్వాతంత్రానంతరం భారత దేశమును కూడా ఇరుపక్షాలు తమవైపు ఉండాలంటూ ఆహ్వానించాయి, సోయట్ తో భారతీయ పాలకులకు మంచి స్నేహం ఉన్నప్పటికీ దాన్ని పక్కనపెట్టి ఎటువైపు మొగ్గకూడదని నిర్ణయాన్ని తీసుకున్నారు, మరికొన్ని దేశాలతో కలిసి తృతీయ దేశాల సమాఖ్యను అలీన ఉద్యమాన్ని ప్రారంభించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రధాన దేశాలు ఇరువైపుల మొహరించి యుద్ధానికి తెగబడే పరిస్థితులు ఏర్పడ్డాయి, భారత్ ఎటువైపు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు, దీంతో మధ్యవర్తి పాత్రను మాత్రమే పోషించగలిగే వెసులుబాటు ఉంది.

అదే సమయంలో విశ్వ గురువుగా గుర్తింపు పొందే అవకాశం ఆసన్నమైంది. ఈ క్లిష్ట సమయంలో భారత్ యుద్ధ విరమణ ప్రతిపాదనలను ఇరువైపులా ఒప్పించగలగాలి, అలాగే భారత్ ఎవరి పక్షం కాదన్న విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేయాలి, అదే సమయంలో ఇరువైపుల్లో ఏ వైపు మొహరించేందుకు సిద్ధంగా లేని తృతీయ ప్రపంచ దేశాల ప్రయోజనాలను భారత దేశం నేతృత్వం వహించి రక్షించాలి, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక సైనిక సామాజిక వ్యవస్థ అయిన భారత్ కు అంతర్జాతీయ సమాజం పట్ల ఈ బాధ్యత ఉంది. అలీనోద్యమ లక్ష్యాల సాధన దిశగా ప్రయత్నాలు కొనసాగించాలి, యుద్ద పరిస్థితిలు సాధారణ స్థితికొచ్చిన అనంతరం భారత్ తన ఆధునిక విధానాల కారణంగా ప్రపంచం మొత్తం గుర్తించే నాయకత్వ స్థాయికి ఎదుగుతుందన్న విశ్వాసం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతుందనీ డాక్టర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS