Wednesday, April 16, 2025
spot_img

స్పూర్తిదాయకంగా వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025

Must Read

నిజ జీవిత​ హీరోలు, స్పూర్తిదాయక వ్యక్తులు, భవిష్యత్‌ తరానికి మార్గదర్శకులైన వారిని ‘వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025’తో సత్కరించనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. విభిన్న రంగాల్లో విశేష కృషితో పాటు తమ సంఘం అభివృద్ధికి నిరంతరం పాటు పడుతున్న స్పూర్తిదాయక వ్యక్తిత్వాలను వైశ్య అచీవర్స్ అవార్డ్స్‌తో గౌరవించనున్నట్లు పేర్కొన్నారు. వైశ్య అచీవర్స్ అవార్డ్స్ విభిన్న రంగాల్లో ఉన్నత స్థాయిని చేరుకోవడమే కాకుండా సమాజహితం కోసం వినూత్న కార్యక్రమాలను చేపడుతున్న వారికి అద్భుత వేదికను అందించనుంది. ఈ అవార్డు పొందిన వ్యక్తులు లేదా సంస్థలు భవిష్యత్తు ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం, మార్కెటింగ్, తమను తాము లేదా వారి బ్రాండ్‌ను ఉన్నత స్థాయికి చేరుకునేలా బ్రాండింగ్ చేయడం వంటివి అదనపు ప్రయోజనాలను పొందుతారని అవార్డ్స్‌ కమిటీ వెల్లడించింది. ఈ అవార్డులను మే 27 న ప్రధానం చేయనున్నట్లు నిర్వాహాకులు పేర్కొన్నారు.

ఈ అవార్డులను సామాజికంగా విద్య, వైద్యం, సినిమా, క్రీడలు, వ్యాపారం, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, సామాజిక సేవ వంటి 18 విభిన్న విభాగాలకు చెందిన అంశాల్లో ప్రధానం చేయనున్నారు. అంతేకాకుండా భవిష్యత్‌ ఆవిష్కర్తగా ( ఇన్నోవేటర్‌ ఆఫ్‌ టుమారో) ప్రత్యేక జ్యూరీ అవార్డును సైతం అందిస్తున్నారు. అవార్డుల విభాగాల్లో భాగంగా.. లెగసీ – లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, లైఫ్ సేవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌, విశ్వకర్మ అవార్డు – విజనరీ ఇన్ఫ్రా లీడర్ ఆఫ్ ఇయర్, ఇన్నోవేషన్ అవార్డు, మాస్టరీ అవార్డు, టార్చ్ బేరర్ అవార్డు, ట్రైల్‌బ్లేజర్ అవార్డు, NRI బీకాన్ అవార్డు, యంగ్ స్టార్ ప్రాడిజీ అవార్డు, AI నెక్సస్ అవార్డు, కర్మ యోధ అవార్డు, గురు బ్రహ్మ అవార్డు, చిత్రగుప్త అవార్డు, గ్లోబల్ ఐకాన్ అవార్డు, కథా నాయక్/ కథా నాయకి, ఛాంపియన్ అవార్డు, టెక్ అవార్డు, NGO ఇంపాక్ట్ అవార్డులను అందించనున్నారు.

వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025 ఛైర్మన్, డైరెక్టర్‌గా ప్రముఖ వ్యాపారవేత్త, సమాజసేవకులు, వాసవి బిజినెస్ గ్రూప్ వ్యవస్థాపకులు, మీటింగ్ మిలియనీర్స్ నెట్‌వర్క్,, వాసవి వెంచర్స్, వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్‌కు చెందిన మాదిపడిగే రాజు విశేష సేవలందిస్తున్నారు. బోర్డు డైరెక్టర్లుగా ఎస్ ఆర్ ఎస్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మేడా నరేష్, సీజన్స్ హాస్పిటల్ వ్యవస్థాపకురాలు డీఆర్‌.జగన్నాధ్ జైనా, బేగంపేటలోని స్మైల్ మైల్స్ డెంటల్ హాస్పిటల్ డైరెక్టర్ డా.కళ్యాణి గుడుగుంట్ల, ఎస్కెపి అడ్వైజరీ గ్రూప్ సీఈఓ పబ్బిసెట్టి శివ కుమార్, డైరెక్టర్ నీమాక్స్ గ్రూప్ డాక్టర్ నీలిమ వేముల, వజ్ర ఈవెంట్స్ వ్యవస్థాపకులు అరుణ్ కుమార్, మెడుసా ఫ్యాషన్ కో, ఫెసిల్ ఇంగ్లీష్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు సంతోష్ చెగు, సృజన్ జ్యువెల్లర్స్ వ్యవస్థాపకులు కోలిపర రవి కుమార్, ఇండియుగ్ కోల్డ్-ప్రెస్డ్ ఆయిల్స్, నేచురల్ ప్రొడక్ట్స్ వ్యవస్థాపకులు యెలోజ్ సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు.

Latest News

రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం

అనేకకార్యక్రమాలు అమలుచేసి చూపాం సిఎల్‌పి సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS